ధోనీని మించిన నాయకుడు, చెన్నైకి మించిన జట్టు లేదు : పియూష్‌ చావ్లా

ధోనీని మించిన నాయకుడు, చెన్నైకి మించిన జట్టు లేదు : పియూష్‌ చావ్లా
x
పియూష్‌ చావ్లా, ధోనికి ఫైల్ ఫోటో
Highlights

భారత జట్టు సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ ధోనికి మించిన కెప్టెన్ మరొకరు లేరని, చెన్నైకి మించిన జట్టు మరొకటి లేదని అన్నాడు భారత లెగ్ స్పిన్నర్ పియూష్‌ చావ్లా..

భారత జట్టు సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ ధోనికి మించిన కెప్టెన్ మరొకరు లేరని, చెన్నైకి మించిన జట్టు మరొకటి లేదని అన్నాడు భారత లెగ్ స్పిన్నర్ పియూష్‌ చావ్లా.. ఏ ఆటగాడైనా సరే గొప్ప నాయకుడు ఉన్న జట్టులో ఆడాలని కోరుకుంటాడని అన్నాడు. కోల్‌కతాలో నిన్న (గురువారం) జరిగిన ఐపీఎల్‌ వేలంలో చావ్లాను చెన్నై టీం రూ.6.75 కోట్ల భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకుంది. ఈ వేలంలో భారత క్రికెటర్లలో అత్యధిక ధరకు అమ్ముడిపోయిన ఆటగాడిగా పియూష్‌ నిలిచాడు. గతంలో పియూష్‌ చావ్లాని రూ.4.2 కోట్లకు కోల్‌కతా సొంతం చేసుకుంది. ఈసారి అతన్ని వదిలేయడంతో చావ్లా వేలానికొచ్చాడు.

ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ గురించి పియూష్‌ మాట్లాడుతూ.. " కేకేఆర్ ఆలోచనలు వేరు. ఈడెన్‌గార్డెన్స్‌ పిచ్‌ స్పిన్నర్లకు అంతగా అనుకూలించదు కాబట్టి వారు ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్ పైన దృష్టి పెట్టారని, జట్టులో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు అవసరం లేదని భావించారని అన్నాడు. అందుకే నన్ను వదిలిపెట్టారని చెప్పుకొచ్చాడు. అయిన మా మధ్య సంబంధాలు ఆరోగ్యకరంగానే ఉన్నాయని మా మద్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చాడు పియూష్‌ ..

ప్రస్తుతం 30 సంవత్సరాలు ఉన్న పియూష్‌ చావ్లా ప్రస్తుతం రంజీ మ్యాచ్ లో ఆడుతున్నాడు. ఇక అతని ఐపీఎల్‌ కెరియర్ విషయాని వచ్చేసరికి ఐపీఎల్‌ 2008 నుంచి 2013 వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోసం ఆడాడు పియూష్ . ఆ తర్వాత ఐపిఎల్ 7 వేలంలో చావ్లాను కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2020 ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్ కింగ్స్ 6.75 కోట్లకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories