నిలకడగా పాకిస్థాన్ బ్యాటింగ్

నిలకడగా పాకిస్థాన్ బ్యాటింగ్
x
Highlights

వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ నిలకడగా ఆడుతూ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. వన్ డౌన్ గా వచ్చిన బాబర్ అజాం హఫీజ్ తో...

వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ నిలకడగా ఆడుతూ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. వన్ డౌన్ గా వచ్చిన బాబర్ అజాం హఫీజ్ తో కల్సి సమన్వయంతో బ్యాటింగ్ చేసి 63 పరుగులు వద్ద అవుటయ్యాడు. 33ఓవర్‌ ఐదో బంతికి వోక్స్‌ క్యాచ్‌ ఇచ్చి బాబర్‌ వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లు మంచి బంతులతో పాకిస్థాన్ ను కట్టడి చేయాలని చూస్తున్నా వారికి అదేస్థాయిలో బదులిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తున్నారు పాక్ బ్యాట్స్ మెన్. 36 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 223 పరుగుల స్కోరు సాధించి మ్యాచ్ పై పట్టు బిగించింది పాకిస్థాన్. ఇంకా పదిహేను ఓవర్లు ఉండడం.. ఏడు వికెట్లు చేతిలో ఉండడంతో పరుగుల వరద పారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories