logo

సమరానికి సిద్ధం.. టాస్ గెలిచిన పాక్

సమరానికి సిద్ధం.. టాస్ గెలిచిన పాక్
Highlights

వరల్డ్ కప్ టోర్నీ లో పదకొండో టీమ్ గా ఆడుతున్న వరుణుడు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కు దూరంగా జరగాలని...

వరల్డ్ కప్ టోర్నీ లో పదకొండో టీమ్ గా ఆడుతున్న వరుణుడు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కు దూరంగా జరగాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. వాతావరణం వేడెక్కింది. ఒక పక్క భానుని రాకతో.. మరో పక్క అభిమానుల సందడితో! మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ మొదలవబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఊపిరి బిగబట్టి మ్యాచ్ మొదలయ్యే క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచ కప్ టోర్నీ అంతా ఒక ఎత్తు.. పాకిస్థాన్ తో టీమిండియా తలపడే మ్యాచ్ మరో ఎత్తు. ఈ మ్యాచ్ కు ఉన్నత ఉత్కంఠ మారె మ్యాచ్ కూ కనబడదు. ఊపిరి పీల్చుకొంది అభిమానుల్లారా.. టీమిండియా కొద్దీ నిమిషాల్లో పాకిస్థాన్ తో తలబడబోతోంది. తర్వాత ఊపిరి పీల్చుకునే అవకాశమే లేనంత ఉద్వేగం మీ సొంతం కాబోతోంది!

టాస్ గెలిచిన పాకిస్థాన్..

బొమ్మ..బొరుసూ అయిపొయింది.. పాకిస్థాన్ టాస్ గెలిచింది. టీమిండియా కు బ్యాటింగ్ అప్పచెప్పింది. ఇంకొంత సేపట్లో భారత్ ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ..కెఎల్ రాహుల్ ప్రారంభించబోతున్నారు.
లైవ్ టీవి


Share it
Top