పాకిస్థాన్ భారీ స్కోరు!

పాకిస్థాన్ భారీ స్కోరు!
x
Highlights

సోహైల్‌ మెరుపులు.. బాబర్ సమయోచిత బ్యాటింగ్.. ఇమామ్, జమాన్ ల చక్కని పునాది వెరశి పాకిస్థాన్ మూడొందల పై చిలుకు భారీ పరుగుల లక్ష్యాన్ని దక్షినాఫ్రికాకి...

సోహైల్‌ మెరుపులు.. బాబర్ సమయోచిత బ్యాటింగ్.. ఇమామ్, జమాన్ ల చక్కని పునాది వెరశి పాకిస్థాన్ మూడొందల పై చిలుకు భారీ పరుగుల లక్ష్యాన్ని దక్షినాఫ్రికాకి నిర్దేశించగలిగింది. అవసరమైన చోట నిదానించి.. అవకాశం వచ్చినచోట బంతిని బౌన్డరీలను దాటించి పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ విజ్రుంభించారు. దాంతో నిర్ణీత ఏభై ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 7 వికెట్లు నష్టపోయి 309 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన పాక్ జట్టు 4 ఓవర్లు ముగిసే సమయానికి 29/0 పరుగులు చేసింది. నాలుగో ఓవర్‌లో ఇమామ్‌ మూడు ఫోర్లు కొట్టాడు. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ల భాగస్వామ్యాన్ని తాహీర్‌ విడదీశాడు. ఇన్నింగ్స్ 15 ఓవర్లో ఐదో బంతిని జోరు మీదున్న ఫకర్‌ జమాన్‌(44; 50బంతుల్లో) రివర్స్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో స్లిప్‌లో ఉన్న ఆమ్లా చేతికి క్యాచ్ ఇచ్చాడు. తరువాత నుంచి పాక్ పరుగులు తీయకుండా తాహిర్ నియంత్రించాడు. మరో వైపు ఎంగిడి కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో పరుగుల వేగం నెమ్మదించింది. ఆజట్టు స్కోరు 98 వున్నపుడు 21 వ ఓవర్లో తాహిర్ మరోసారి పాక్ ను దెబ్బతీశాడు. ఆ ఓవర్‌లో మూడో బంతికి కుదురుకున్న ఇమాముల్‌(44; 57బంతుల్లో)ను అద్భుత క్యాచ్‌ అందుకొని పెవిలియన్‌కు పంపాడు. అక్కడనుంచి బాబర్, హఫీజ్ లు నిదానంగా ఆడుతూ వచ్చారు. 25వ ఓవర్ నుంచి ఇద్దరూ గేరు మార్చారు. వరుసగా షాట్లు కొట్టడం మొదలు పెట్టారు. కానీ ఆ జోరు రెండు ఓవర్లే కొనసాగింది. సౌతాఫ్రికా బౌలింగ్ జాగ్రతగా చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. 30వ ఓవర్లో మార్క్రమ్‌ బౌలింగ్‌లో హఫీజ్‌ ఎల్బీగా‌(20; 33బంతుల్లో)వెనుదిరిగాడు. తరువాత వచ్చిన సోహైల్‌ బాబర్ తో కల్సి పాక్ ఇన్నింగ్స్ ను పరిగెత్తించాడు. ఇద్దరూ కలిసి స్కోరును 42 ఓవర్లకి 229 వరకూ తీసుకు వచ్చారు. జోరుమీదున్న బాబర్(69; 80బంతుల్లో) ఫెలుక్వాయో బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడిఎంగిడి చేతికి చిక్కాడు. అనంతరం సోహైల్ ఒక్కడే ఒంటరిగా షాట్లు ఆడుతూ వచ్చాడు. మొత్తమ్మీద 59బంతుల్లో 89 పరుగులు చేసిన సోహైల్ చివరి ఓవర్లో ఔటయ్యాడు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఒవర్ల్లలో 7 వికెట్లకు 309 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories