పాపం పాకిస్థాన్ క్రికెటర్లు!

పాపం పాకిస్థాన్ క్రికెటర్లు!
x
Highlights

ఏ ఆటలోనైనా ఏం కోరుకుంటారు? తమ జట్టు గెలవాలని. అభిమానులు దేనికోసం చూస్తారు? తమ అభిమాన ఆటగాళ్ళు రెచ్చిపోయి ఆది తమ దేశాన్ని గెలిపించాలని. అదే తపన...

ఏ ఆటలోనైనా ఏం కోరుకుంటారు? తమ జట్టు గెలవాలని. అభిమానులు దేనికోసం చూస్తారు? తమ అభిమాన ఆటగాళ్ళు రెచ్చిపోయి ఆది తమ దేశాన్ని గెలిపించాలని. అదే తపన పాకిస్థాన్ ఆటగాళ్లకూ, అభిమానులకూ ఉంటుంది. అంతే కదా! కానీ, ఈ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ మాత్రం ఇటు పాకిస్థాన్ క్రికెటర్లకూ.. అభిమానులకూ వింత కోరికను తెచ్చిపెట్టింది. అదే.. ఇంగ్లాండ్ ఓడిపోవాలని. దాని కోసం పాపం ఎన్నడూ లేని విధంగా భారతదేశం మీద ఉన్న ద్వేషాన్ని కూడా మర్చిపోయి సపోర్ట్ చేశారు. టీమిండియా గెలవాలంటూ ఆ దేశపు మాజీ క్రీడాకారులు కూడా తెగ కోరుకున్నారు. అయితే, దురదృష్టం వాళ్ళదో, మనదో కానీ అప్పటిదాకా ఊపు మీదున్న ఇండియా ఆ మ్యాచ్ లో చేతులెత్తేసింది. ఇక న్యూజిలాండ్ అయినా గెలవాలని కోరుకుని ఆ మేరకు ఎదురుచూపులు చూసారు. ఈసారి ఇంకాస్త చిత్తుగా న్యూజిలాండ్ ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సెమీస్ కు చేరిపోయింది. ఇది జరిగిన కథ.

ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఇంగ్లాండ్ ఓడిపోతే బావుండునని కోరుకుని మీడియాలో తెగ మాట్లాడిన వాళ్ళు కూడా..ఇపుడు పాకిస్థాన్ క్రికెటర్లని నిందిస్తున్నారు.

ప్రతి క్రికెట్‌ అభిమాని తమ ఆటగాళ్ళని దుమ్మెత్తి పోస్తున్నాడు. ముందునుంచీ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడకుండా.. ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పాక్‌ మాజీ ఆటగాళ్లు 'అల్లాకి దువా' చేస్తున్న ఫొటో షేర్‌ చేసి.. మా ఆటగాళ్లు దేవునిదే భారం అనే ధోరణిలో ఉన్నారని.. కష్టపడి ఆడడం రాదని చురకలంటిస్తున్నారు.

ఇంతకీ, ఆటగాళ్లే కాదు మనమూ అదే కోరుకున్నామన్న సంగతి వారందరికీ గుర్తుందో లేదో? పాపం పాకిస్థాన్ క్రికెటర్లు!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories