వరుస కట్టేస్తున్నారు

వరుస కట్టేస్తున్నారు
x
Highlights

వరల్డ్ కప్ రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ పిల్లి మొగ్గలేస్తోంది. వెస్టిండీస్ తో తానాడుతున్న మొదిటి మ్యాచ్ల్లో ఆ జట్టు బ్యాట్సమెన్ పెవిలియన్ కు వరుస...

వరల్డ్ కప్ రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ పిల్లి మొగ్గలేస్తోంది. వెస్టిండీస్ తో తానాడుతున్న మొదిటి మ్యాచ్ల్లో ఆ జట్టు బ్యాట్సమెన్ పెవిలియన్ కు వరుస కడుతున్నారు. 15 ఓవర్లకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాక్.. 17 వ ఓవర్ వచ్చేసరికి మరో మూడు వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్లకు పాక్‌ 75/4 స్కోరుతో ఉంది. హఫీజ్‌ (11), సర్ఫరాజ్‌ (8) ఆచితూచి ఆడారు. అయితే 17 వ ఓవర్లో కథ మారిపోయింది. ముందు పాక్‌ సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌ (8; 12 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. హోల్డర్‌ వేసిన 16.1వ బంతిని ఆడబోయి కీపర్‌ షైహోప్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దానికి మొదట అంపైర్‌ ఔటివ్వలేదు. విండీస్‌ సమీక్ష కోరింది. అందులో ఔటని తేలింది. తరువాత హోల్డర్‌ వేసిన 16.6వ బంతికి ఇమాద్‌ వసీమ్‌ (1; 3 బంతుల్లో) ఔటయ్యాడు. స్లిప్‌లో గేల్‌ సులభ క్యాచ్‌ అందుకున్నాడు. తరువాతి ఓవర్లో మరో వికెట్ ను పాక్ కోల్పోయింది. ఒషాన్‌ థామస్‌ వేసిన 17.3వ బంతికి షాబాద్‌ ఖాన్‌ (0; 1 బంతి) ఔటయ్యాడు. 18.4వ బంతికి మరో వికెట్ పాక్ కోల్పోయింది. హోల్డర్‌ వేసిన 18.3వ బంతిని ఆడబోయి హసన్‌ అలీ (1; 4 బంతుల్లో) కాట్రెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

ఇప్పటికే 8 వికెట్లను కోల్పోయిన పాక్ జట్టు 19 ఓవర్లలో 83 పరుగులు మాత్రమే చేయగలిగింది. వంద పరుగులు కూడా ఆ జట్టు చేయడం కష్టం గా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories