బంగ్లా పోతు పోతు పాక్ ని కూడా ఇంటికి పంపింది ..

బంగ్లా పోతు పోతు పాక్ ని కూడా ఇంటికి పంపింది ..
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 94 పరుగుల తేడాతో విజయం సాదించింది .. మొదటగా టాస్ గెలిచినా...

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 94 పరుగుల తేడాతో విజయం సాదించింది .. మొదటగా టాస్ గెలిచినా పాకిస్తాన్ నిర్ణిత 50 ఓవర్లో 315 పరుగులు చేసింది . ఓపెనర్‌ ఇమాముల్‌(100; 100బంతుల్లో 7×4) శతకం సాధించగా.. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ అజామ్‌(96; 98బంతుల్లో 11×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. కానీ మీగాతా బాట్స్ మెన్స్ పెద్దగా రాణించకపోవడంతో పాక్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది . లక్ష్య చేధనకి దిగిన బంగ్లాదేశ్ 44.1 ఓవర్లలో 221 పరుగులకే కుప్పకూలింది. పాక్ విజయం సాధించినప్పటికీ సెమిస్ కి చేరలేదు ..

ఒకవేళ పాక్ 350 పరుగులు చేసి 311 పరుగుల తేడాతో గెలిచి ఉంటే పాక్ సెమిస్ కి చేరేది .. ప్రస్తుతం పాక్ టోర్నీ నుండి నిష్క్రమించినట్టు అయింది .. అయితే మ్యాచ్ కి ముందు పాక్ కెప్టెన్ సర్పరాజ్ మాత్రం 500 పరుగులు చేసి బంగ్లా పై విజుయం సాధించి దర్జాగా సెమిస్ కి చేరుతామని చెప్పుకొచ్చాడు .. కానీ అ మాటను సీరియస్ గా తీసుకున్న బంగ్లా టీం పాక్ ఆశల పైన నీళ్ళుచల్లేసింది.. దీనితో బంగ్లా పోతు పోతు టోర్నీ నుండి పాక్ ని కూడా ఇంటికి పంపేసింది బంగ్లాదేశ్ ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories