దక్షిణాఫ్రికా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్న పాక్

దక్షిణాఫ్రికా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్న పాక్
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు లార్డ్స్ లో పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టు...

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు లార్డ్స్ లో పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లూ వరుస ఓటములతో టోర్నీలో వెనుకంజలో ఉండడంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో ముందుకు సాగాలని భావిస్తున్నాయి. దీంతో పాక్ జట్టు పట్టుదలగా బ్యాటింగ్ చేస్తోంది. 15 ఓవర్ల వరకూ వికెట్ కోల్పోకుండా ఓపెనర్లు ఫకర్‌ జమాన్‌, ఇమామ్‌ చక్కని సమన్వయంతో బ్యాట్టింగ్ చేశారు. పద్నాలుగు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 75 పరుగులు చేసి చక్కని పునాది వేశారు ఓపెనర్లు.


అయితే, 15 వ ఓవర్లో ఇమ్రాన్ తాహిర్ వేసిన మొదటి బంతికి బౌండరీ బాదిన జమాన్ అదే ఓవర్లో ఐదో బంతికి హాషిం ఆమ్లాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఏభై బంతుల్లో 44 పరుగులు చేశాడు జమాన్. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన అజాం తో కలసి ఇమామ్‌ (44) పాక్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపిస్తున్నాడు. వికెట్ పడడంతో పరుగుల వేగం మందగించింది. మొత్తమ్మీద 20 ఓవర్లకు పాకిస్తాన్ ఒక్క వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది. అజాం 7 పరుగులు చేశాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories