ఫ్రస్ట్రేషన్ : పాక్ కెప్టన్ కటౌట్ తన్నిన అభిమాని...

ఫ్రస్ట్రేషన్ : పాక్ కెప్టన్ కటౌట్ తన్నిన అభిమాని...
x
Highlights

విజయం వస్తే నెత్తిన పెట్టుకుంటారు అభిమానులు... అదే ఓటమి వస్తే ఎం చేయడానికైనా వెనుకాడరు. ఇప్పుడు అలాంటి సంఘటన పాకిస్తాన్ క్రికెటర్లకు ఎదురైంది. శ్రీలంక...

విజయం వస్తే నెత్తిన పెట్టుకుంటారు అభిమానులు... అదే ఓటమి వస్తే ఎం చేయడానికైనా వెనుకాడరు. ఇప్పుడు అలాంటి సంఘటన పాకిస్తాన్ క్రికెటర్లకు ఎదురైంది. శ్రీలంక జట్టుతో జరిగిన టీ20 సిరీస్లో భాగంగా పాకిస్తాన్ వైట్‌వాష్ ని ఎదురుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే భద్రత దృష్ట్యా శ్రీలంక స్టార్ ఆటగాళ్ళు ఈ సిరీస్ కి దూరం అయ్యారు. కానీ యంగ్ ప్లేయర్స్ తో శ్రీలంక జట్టు పాక్ పై సిరిస్ ని సొంతం చేసుకుంది. దీనితో పాక్ ఆటగాళ్ళపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌, కోచ్‌ మిస్బావుల్‌ హక్‌ లపై గరంగరంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ కి చెందినా ఓ అభిమాని సర్ఫరాజ్‌ అహ్మద్‌ కటౌట్‌ను కసితీరా కాలితో తన్నాడు. కటౌట్‌ పూర్తిగా పడిపోయే వరకు అక్కడి నుండి పోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories