జోరు తగ్గించిన పాక్ బ్యాట్స్ మెన్

జోరు తగ్గించిన పాక్ బ్యాట్స్ మెన్
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికాల మధ్య పోరు జరుగుతోంది. నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్ ను పరుగులు చేయనీకుండా దక్షిణాఫ్రికా బౌలర్లు...

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికాల మధ్య పోరు జరుగుతోంది. నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్ ను పరుగులు చేయనీకుండా దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టడి చేస్తున్నారు. 20 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసిన పాకిస్తాన్ 32 ఓవర్లు వచ్చేసరికి మరో రెండు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. మొదట్లో సాగినంత వేగంగా పాక్ బ్యాటింగ్ ఇప్పుడు లేదు. పరుగులు కష్టం మీద వస్తున్నాయి. 21వ ఓవర్‌లో మూడో బంతికి కుదురుగా ఆడుతున్న ఇమాముల్‌(44; 57బంతుల్లో) తాహిర్ పెవిలియన్‌కు పంపాడు. తరువాత వచ్చిన హఫీజ్‌ తో కలసి బాబర్ పాక్ ఇన్నింగ్స్ ను కుదురుగా నడిపించాడు. అయితే, పరుగులు వేగం తగ్గించినా.. వికెట్లు తీయడంలో దక్షిణాఫ్రికా బౌలర్లు 30వ ఓవర్ వరకూ విఫలప్రయత్నం చేశారు. ఈ దశలో హఫీజ్‌(20; 33బంతుల్లో) ఔటయ్యాడు. మర్క్రమ్‌ బౌలింగ్‌లో ఆఖరి బంతికి హఫీజ్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో పాకిస్తాన్ స్కోరు డ్రింక్స్ సమయానికి (32) )వారలు పూర్తయ్యేసరికి మూడు వికెట్లకు 156కు చేరింది. అజాం 38(49), సోహిల్ 6(4) క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories