చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ లో నైల్ రికార్డ్

చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ లో నైల్ రికార్డ్
x
Highlights

ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ బ్యాట్‌తో మెరిశాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ ఒకానొక...

ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ బ్యాట్‌తో మెరిశాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ ఒకానొక దశలో 147 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో స్టీవ్‌ స్మిత్‌తో కలిసి కౌల్టర్‌ నైల్‌ రెచ్చిపోయాడు. వచ్చిరాగనే కరేబియన్‌ బౌలర్లపై విరుచకుపడ్డాడు. దీంతో సెంచరీ సాధిస్తాడునుకున్న తరుణంలో 92 పరుగుల వద్ద బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్‌గా వెనుదిరుగుతాడు. అయితే ఈ సమయంలో కౌల్టర్‌ నైల్‌ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రపంచకప్‌లో ఎనిమిది, ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు(92) సాధించిన ఆసీస్‌ ఆటగాడిగా కౌల్టర్‌ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆండీ బికెల్‌(65 పరుగులు, 2003లో ఇంగ్లండ్‌పై)రికార్డును అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా వన్డేల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగుల సాధించిన మూడో ఆటగాడిగా మరో ఘనతన అందుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌(95 నాటౌట్‌, 2016లో శ్రీలంకపై)తొలి స్థానంలో ఉన్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories