మూడో బెర్త్ కోసం కివీస్-ఇంగ్లాండ్ పోటీ..

మూడో బెర్త్ కోసం కివీస్-ఇంగ్లాండ్ పోటీ..
x
Highlights

వరల్డ్ కప్ ఈవెంట్ లో ఈరోజు మరికొద్ది సేపట్లో మరో రసవత్తర పోరు జరగబోతోంది. హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగి.. అదిరిపోయే ఆరంభంతో మిగిలిన టీములకు...

వరల్డ్ కప్ ఈవెంట్ లో ఈరోజు మరికొద్ది సేపట్లో మరో రసవత్తర పోరు జరగబోతోంది. హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగి.. అదిరిపోయే ఆరంభంతో మిగిలిన టీములకు బెదురుపుట్టించి.. ఆనక సెమీస్ బెర్త్ కోసం ఆపసోపాలు పడుతున్న ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు, నిలకడగా రాణిస్తూ.. సెమీస్ లో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు నేరుగా సెమీస్ లో మూడో స్థానం దక్కించుకోగలుగుతారు. ఎటువంటి సమీకరణాలతో పని లేకుండా నిశ్చింతగా సెమీస్ కు అర్హత పొందుతారు.

లెక్క ఇదీ..

ప్రస్తుతం ఇంగ్లాండ్ 10 పాయింట్లతోనూ, న్యూజిలాండ్ 11 పాయింట్ల తోనూ ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ గెలిస్తే 12 పాయింట్లతో మూడు ఖాయం. అదేవిధంగా కివీస్ గెలిస్తే 13 పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఇక పాకిస్తాన్ 9 పాయింట్లతో ఉంది. బంగ్లాదేశ్ తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఇవాళ గెలిస్తే.. సరేసరి.. లేకపోతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద ఓడిపోతేనే సెమీస్ చాన్స్ ఉంటుంది. ఒకవేళ న్యూజిలాండ్ ఓడిపోయినా అదే పరిస్థితి. ఇప్పుడు ఇంగ్లాండ్ ఓడిపోతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై గెలిస్తే 11 పాయింట్లతో పాక్ సెమీస్ కు చేరుకుంటుంది. కివీస్ ఈరోజు ఓడిపోయినా అంతే.. పాకిస్తాన్ బంగ్లా మీద గెలుస్తుందా లేదా అన్నదానిపై కివీస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

మొత్తమ్మీద ఈ మ్యాచ్ రెండు జట్లకూ అతి ముఖ్యమైనదిగా మారిపోయింది. టోర్నీ మొత్తంలో ఇప్పటివరకూ ఇదే అంత ఆసక్తి రేకెత్తిస్తున్న మ్యాచ్.

ఇక గణాంకాల విషయానికి వస్తే.. వరల్డ్ కప్ టోర్నీల్లో ఇప్పటివరకూ ఇంగ్లాండ్ పై కివీస్ దే పైచేయి. ఇప్పటివరకూ 8 సార్లు ప్రపంచ కప్ టోర్నీల్లో రెండు తీములూ తలపడ్డాయి. వాటిలో 5 సార్లు న్యూజిలాండ్ గెలిచింది. 3 ఇంగ్లాండ్ స్వంతం చేసుకుంది. 1983 తరువాత వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ ఇప్పటివరకూ కివీస్ పై గెలవలేదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories