భారత క్రికెట్లో నయా లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే

భారత క్రికెట్లో నయా లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే
x
Highlights

భారత క్రికెట్లోకి మరో జాదూ లెగ్ స్పిన్నర్ దూసుకొచ్చాడు. ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేసి దేశవాళీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ల్లో సత్తా చాటుకొన్న పంజాబ్...

భారత క్రికెట్లోకి మరో జాదూ లెగ్ స్పిన్నర్ దూసుకొచ్చాడు. ఐపీఎల్ ద్వారా అరంగేట్రం చేసి దేశవాళీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ల్లో సత్తా చాటుకొన్న పంజాబ్ యువ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఏకంగా టీమిండియా టీ-20 జట్టులోనే చోటు సంపాదించాడు. విశాఖ వేదికగా జరిగే సూపర్ సండే టీ-20 తొలిసమరంలో టీ-20 అరంగేట్రానికి మయాంక్ ఎదురుచూస్తున్నాడు.

జాదూ స్పిన్నర్లకు చిరునామాగా నిలిచే భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఐపీఎల్ పుణ్యమా అంటూ మరో నవతరం స్పిన్నర్ దూసుకొచ్చాడు. హర్యానా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్, ఉత్తరప్రదేశ్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ వైపు అంతర్జాతీయ క్రికెట్లో తమ స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తుంటే సరికొత్తగా పంజాబ్ లెగ్ స్పిన్ గుగ్లీ బౌలర్ మయాంక్ అగర్వాల్ వచ్చి చేరాడు. ఆస్ట్రేలియాతో ఈనెల 24 నుంచి జరిగే రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ద్వారా తన సత్తా చాటుకోడానికి ఉరకలేస్తున్నాడు. పంజాబ్ లోని పటియాలాకు చెందిన మయాంక్ అగర్వాల్ ఫాస్ట్ బౌలర్ కాబోయే తన శిక్షకుడి సలహాతో లెగ్ స్పిన్ బౌలర్ గా మారాడు. 20 ఏళ్ల చిరుప్రాయంలోనే ఐపీఎల్ 11వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టులో కనీసధర 20 లక్షల రూపాయల కాంట్రాక్టుతో చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన సీజన్ ప్రారంభమ్యాచ్ లోనే మయాంక్ అగర్వాల్ తన స్పిన్ జాదూ ఏపాటిదో చాటుకొన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీతో సహా నలుగురు చెన్నై బ్యాట్స్ మన్ ను పెవీలియన్ దారి పట్టించాడు. సీజన్ లో ఆడిన మొత్తం 14 మ్యాచ్ ల్లో 15 వికెట్లు పడగొట్టి వారేవ్వా అనిపించుకొన్నాడు.

లెగ్ బ్రేక్, గుగ్లీ, టాప్ స్పిన్ అస్త్రాలను అసాధారణ నియంత్రణతో గురితప్పని విధంగా ప్రయోగిస్తూ తన లోని ప్రతిభను చాటి చెప్పాడు. ఐపీఎల్ సీజన్లో మాత్రమే కాదు పంజాబీ రంజీట్రోఫీ జట్టులో సభ్యుడిగానూ మయాంక్ చెలరేగిపోయాడు. 2018 రంజీ సీజన్లో మయాంక్ ఆడిన ఆరు రంజీ మ్యాచ్ ల్లోనే 29 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు ఇండియా-ఏ జట్టులో సైతం చోటు సంపాదించాడు. మైసూర్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్ తో ముగిసిన నాలుగురోజుల టెస్ట్ మ్యాచ్ లో మయాంక్ ఏకంగా ఐదు వికెట్లుపడగొట్టి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. రంజీట్రోఫీతో పాటు ఇండియా-ఏ జట్టు తరపునా నిలకడగా రాణించిన మార్కండేకు ఆస్ట్రేలియాతో ఈనెల 24న ప్రారంభమయ్యే రెండుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొనే టీమిండియా జట్టులో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చోటు కల్పించింది. రానున్న కాలంలో టీమిండియా టాప్ ర్యాంక్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కు మయాంక్ మార్కండే గట్టి ప్రత్యర్థిగా నిలిచినా ఆశ్చర్యంలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories