బ్యాడ్‌లక్ భారత్..వరుణుడే భారత్‌ను ముంచాడా..?

బ్యాడ్‌లక్ భారత్..వరుణుడే భారత్‌ను ముంచాడా..?
x
Highlights

టీమిండియా కల చెదిరింది మూడోసారి వరల్డ్ కప్ సాధించాలన్న భారత క్రీడాభిమానుల ఆసలు గల్లంతయ్యాయి సెమీస్ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. టాపార్డర్...

టీమిండియా కల చెదిరింది మూడోసారి వరల్డ్ కప్ సాధించాలన్న భారత క్రీడాభిమానుల ఆసలు గల్లంతయ్యాయి సెమీస్ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. టాపార్డర్ కుప్పకూలగా, జట్టు విజయ తీరాలకు చేర్చేందుకు జడేజా , ధోని చేసిన పోరాటం వృథా అయ్యింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన సెమీ పోరులో 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.

వర్షం కారణంగా ఈరోజు కొనసాగిన సెమీస్ పోరులో ఆదిలోనే టాపార్డర్ కుప్పకూలింది క్రీజులోకి వచ్చిన టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వచ్చిన దారే పట్టారు 5 పరుగులకే 3 వికెట్లు పడిపోయాయి. అనంతరం మరో 19 రన్స్ కు మరో వికెట్ కోల్పోయింది భారత్ ఆ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యాలు వికెట్ కాపాడుకుంటూ వచ్చారు అయితే కివీస్ స్పిన్నర్ సాంట్నర్ వీరిద్దరి సహనాన్ని పరీక్షించి బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చారు.

ధోనీ, జడేజాలు స్కోరు బోర్డును 100, 200 పరుగుల మార్క్ దాటించారు. ధోనీ నెమ్మదిగా ఆడగా జడేజా తొలిత నెమ్మిదిగా ఆడినా అనంతరం బ్యాటు ‎ఝలిపించాడు 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ స్కోరు 208 పరుగుల వద్ద జడేజా భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 31 పరుగులు అవసరం కాగా ఫెర్గ్యుసన్ విసిరిన తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టాడు. దీంతో భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో రెండో పరుగుకు యత్నించిన ధోనీ గుప్టిల్ డైరెక్ట్ త్రో విసరడంతో రనౌటయ్యాడు. దీంతో భారత్ ఆశలు అడియాసలయ్యాయి. టెయింలెండర్లు వెనువెంటనే వెనుదిరగడంతో భారత్ 221 పరుగులకు ఆలౌటయ్యంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories