నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్

నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్
x
Highlights

భారత మహిళల, న్యూజిలాండ్‌ మహిళల మధ్య మౌంట్‌ మాంగనీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ జట్టు ఆదిలోనే రెండు వికెట్లను చేజార్చుకుంది. ఎనమిది పరుగులకే...

భారత మహిళల, న్యూజిలాండ్‌ మహిళల మధ్య మౌంట్‌ మాంగనీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ జట్టు ఆదిలోనే రెండు వికెట్లను చేజార్చుకుంది. ఎనమిది పరుగులకే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది కివీస్. జులన్ గోస్వామి వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికే సుజి బేట్స్ (0) భాటియాకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. నాలుగో ఓవర్లో పాండే బౌలింగ్ లో దేవినే (7) ఎల్బీగా వెనుదిరిగింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన డౌన్ (15), వైటీ (22)లు సైతం తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. ప్రశుతం 18 ఓవర్లు ముగిసేసరికి కివీస్ మహిళల జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories