న్యూజిలాండ్‌లో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న క్రికెట్ జట్టు

న్యూజిలాండ్‌లో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న క్రికెట్ జట్టు
x
Highlights

న్యూజిలాండ్‌లో మారణ హోమం జరిగింది. క్రిస్ట్‌చర్చ్‌ సెంట్రల్‌ సిటీలోని హగ్లీపార్క్‌ మసీదు దగ్గర ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఇదే సమయంలో...

న్యూజిలాండ్‌లో మారణ హోమం జరిగింది. క్రిస్ట్‌చర్చ్‌ సెంట్రల్‌ సిటీలోని హగ్లీపార్క్‌ మసీదు దగ్గర ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఇదే సమయంలో మసీదులో ప్రార్ధనలకు వెళుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు ఈ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఒక్కసారిగా కాల్పుల మోత వినపడటంతో ఏం జరుగుతుందో తెలియక స్ధానికులు తలో వైపు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వాహనంలో దాక్కున్న దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వాహనంలో బాంబును గుర్తించి పోలీసులు నిర్వీర్యం చేసేందుకు బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అధికార సమాచార ప్రకారం ఇప్పటి వరకు ఇద్దరు చనిపోగా 50 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడు టెస్ట్‌ కోసం బంగ్లాదేశ్ క్రికేటర్లు ఇక్కడకు చేరుకున్నారు. కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని, కానీ ఆ దేవుడి దయ వల్ల ఎవరికీ ఏమి కాలేదంటూ బంగ్లాదేశ్‌ కోచ్‌ మీడియాకు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories