Top
logo

వారెవ్వా..న్యూజిలాండ్!

వారెవ్వా..న్యూజిలాండ్!
Highlights

న సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. కారణాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ, న్యూజిలాండ్ ఆ ఒక్కరోజు ఆడిన ఆటను మాత్రం...

న సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. కారణాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ, న్యూజిలాండ్ ఆ ఒక్కరోజు ఆడిన ఆటను మాత్రం కచ్చితంగా మెచ్చుకునే తీరాలి. టీమిండియా ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి. వర్షం.. టాప్ ఆర్డర్.. ఓ రనౌట్ అంటూ ఎన్ని చెప్పుకున్నా ఇప్పుడు చేసేదేమీ లేదు కానీ, వన్డే క్రికెట్ అంతే కదా. ఆ ఒక్కరోజు ఎవరు బాగా ఆడితే వారే కింగ్. ఆ లెక్కన చూస్తే కివీస్ కింగ్ అంతే.

ముందస్తు సిద్ధం..

పడుతూ లేస్తూ.. అసలు రేసులో ఉంటామో లేదో తెలీని స్థితిలో కొట్టుమిట్టాడి.. చివరికి అంకెల లెక్కల్లో పాక్ ను వెనక్కి నెట్టి నాకౌట్ చేరింది న్యూజిలాండ్. ఆ విలువ ఏమిటో ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ కి బాగానే తెలుసు. అందుకే సెమీస్ లోకి అడుగు పెట్టిన వెంటనే మైండ్ గేమ్ మొదలెట్టాడు. మా మీద అంచనాలే లేవు.. ఒత్తిడి సమస్యే లేదు. ఇండియా మీదే అంచనాలున్నాయి అంటూ మొదటి బాణం వేశేసాడు. ఇక ఆట మొదలు అయినపుడు అదృష్టం తలుపు తట్టింది. టాస్ గెలిచాడు. బ్యాటింగ్ కు దిగాడు. అయితే, మొదట్లోనే వికెట్ పడిపోతే కంగారు పడలేదు. పిచ్ పరిస్థితి ఏమిటో అంచనా వేశాడు. జాగ్రత్తగా ఆడాడు. టెస్ట్ మ్యాచుల్లో ఎలా ఆడతారో అలా.. వికెట్ నిలబడటమే కావాలి. స్కోరు సంగతి తరువాత. ఇదే పధ్ధతి ఫాలో అయ్యాడు.

లెక్కసరిపోయింది..

పోరాడే స్కోరు చేయాలంటే వికెట్లు చేతిలో ఉండాలని లేక్కేసాడు విలియంసన్. అది సరిగ్గా సరిపోయింది. వర్షం పడినా.. ఆ లెక్క తప్పలేదు. మాములుగా అయితే 240 పెద్ద స్కోరు కాదు. కానీ, పిచ్ పరిస్థితికి అది చాలా ఎక్కువ అయింది. ఈ విషయం బహుశా భారత్ జట్టే కాదు.. మ్యాచ్ చూస్తున్న లక్షలాది మంది గుర్తించలేదు. మన బౌలర్లే అక్కడ ఇరగాదీస్తే.. అటువంటి పిచ్ ల మీదే బౌలింగ్ నేర్చుకుని, వాటి మీదే ఎక్కువగా ఆడే న్యూజిలాండ్ బౌలర్లు రెచ్చిపోలేరా? ఈ లాజిక్ టీమిండియా మిస్ అయింది. అది న్యూజిలాండ్ పట్టుకుంది. వర్షం వలన పిచ్ మారిందో.. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ కు వర్షం మరింత పదును ఇచ్చిందో ఇక్కడ అనవసరం. ఒక వికెట్ పడిపోయింది. రెండో వాళ్ళు జాగ్రత్త పడాలిగా.. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ పడినట్టు.. లేదు.. రెండో వికెట్ పడింది. చేదనలో వీరులమని చెప్పేవారు అంచనా వేయాలిగా లేదు.. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ కు పట్టు చిక్కింది. మూడు వికెట్లు వరుసగా బలమైన ప్రత్యర్థి సమర్పించుకుంటే.. ఇక ఎవరైనా పట్టు బిగిస్తారు. సరిగ్గా అదే చేశాడు విలియమ్సన్.

రెండు తప్పులు చాలు..

'నాకౌట్ మ్యాచ్ లో రెండు తప్పులు చేస్తే చాలు. ఇక ప్రత్యర్థికి అవకాశామిచ్చినట్టే అని మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ కోహ్లీ అన్న మాటలు నిజం అయ్యాయి. రెండు కాదు మూడు వికెట్లు వరుసగా.. ఇక కివీస్ ఫీల్డింగ్ చాలా చాలా బావుంది. అవుట్ ఫీల్డ్ ఎంత వేగంగా ఉన్నా, బౌండరీలు వెళ్ళకుండా ఫీల్డ్ చేసి బ్యాట్స్ మెన్ ను ఒత్తిడి లోకి నెట్టేశారు. ఇటువంటి సమయాల్లో ఒత్తిడిని జయించడమే విజయం అదే చేశారు మన ధోనీ, జడేజా.. ఇక్కడ ఒక్క చోటే కివీస్ కి అదృష్టం తోడైంది. గుప్తిల్ సూపర్ త్రో కి ధోనీ అవుటవడమే కీలకం అయింది. అయితే, ఇక్కడ కూడా న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఒత్తిడిని జయించింది. అదే వారి విజయానికి ప్రధమ కారణం. ఒత్తిడిని నెత్తిమీద పెట్టుకోలేదు. ఎప్పుడూ. గెలిస్తే ఫైనల్స్.. లేకపోయినా పోయేదేం లేదు పోరాడదాం అనే స్ఫూర్తి కలిగించాడు విలియమ్సన్ తన సహచరులకు. అదే మంత్రం కివీస్ ను ఫైనల్ కు చేర్చింది. గెలుపోటములు సహజం. సరైన సమయంలో సరిగా ఆదినవారు గెలుస్తారు. అదే జరిగింది. న్యూజిలాండ్ గెలుపు సమిష్టి గెలుపు. చక్కని ప్రణాళికాబద్ధమైన గెలుపు. దీనిని కాదనలేరు ఎవరూ!

Next Story


లైవ్ టీవి