కివీస్ ఆలౌట్‌ : భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్‌

కివీస్ ఆలౌట్‌ : భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్‌
x
India vs Newzeland First Test Match (File Photo)
Highlights

వెల్లింగ్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 348 పరుగులకి అల్ అవుట్ అయింది. 216 పరుగులకి అయిదు...

వెల్లింగ్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 348 పరుగులకి అల్ అవుట్ అయింది. 216 పరుగులకి అయిదు వికెట్లు కోల్పోయి రెండోరోజు ఆటను ముగించిన కివీస్ ఆదివారం మూడో రోజు ఆటను ప్రారంభించింది. మూడో రోజు ఆట ప్రారంభించిన తొలి బంతికే బుమ్రా బౌలింగ్‌లో వాట్లింగ్‌.. కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేతికి చిక్కాడు. దీంతో కివీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. అనంతరం ఇషాంత్‌ బౌలింగ్‌లో టిమ్‌సౌథీ(6) అవుట్ అయ్యాడు. దీనితో ఏడూ వికెట్లను కోల్పోయింది కివీస్ .. ఈ తరుణంలో కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌(43), కైల్‌ జేమీసన్‌(44) మరో వికెట్ పడకుండా జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కలిసి 71 పరుగులు జోడించారు.

ఆ తర్వాత వీరి జోడిని అశ్విన్‌ విడదీశాడు. ఆ కొద్దిసేపటికే గ్రాండ్‌హోమ్‌ను కూడా అశ్వినే వెనక్కి పంపించాడు. ఆ తర్వాత వచ్చిన అజాజ్‌ పటేల్‌(4), ట్రెంట్‌బౌల్ట్‌(38) పరుగులు చేశారు. చివరికి ఇషాంత్‌ బౌలింగ్‌లో ట్రెంట్‌బౌల్ట్ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీనితో 348 పరుగులకి కివీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 183 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకుంది. భారత బౌలర్లలో ఇషాంత్‌(5), అశ్విన్‌(3), షమి(1), బుమ్రా (1) వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 165 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories