న్యూజిలాండ్‌ ఘన విజయం

న్యూజిలాండ్‌ ఘన విజయం
x
Highlights

బౌలింగ్ లో శ్రీలంకను చుట్టేశారు.. తర్వాత బ్యాటింగ్‌లో సునాయాసంగా పరుగులు తీశారు.. ఇంకేముంది పది వికెట్లతో ఘనవిజయం సాధించేశారు..వరల్డ్ కప్ లో భాగంగా...

బౌలింగ్ లో శ్రీలంకను చుట్టేశారు.. తర్వాత బ్యాటింగ్‌లో సునాయాసంగా పరుగులు తీశారు.. ఇంకేముంది పది వికెట్లతో ఘనవిజయం సాధించేశారు..

వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో గెలిచింది.

న్యూజిలాండ్

ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్‌(73; 51 బంతుల్లో 8x4, 2x6), కొలిన్‌ మన్రో( 58; 47 బంతుల్లో 6x4, 1x6) అర్ధశతకాలతో చెలరేగడంతో 16.1 ఓవర్లలోనే సునాయాసంగా గెలిచింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 29.2 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఏ దశలోనూ భారీ స్కోర్‌ చేసేలాకనిపించలేదు. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే(52; 84 బంతుల్లో 4x4) ఒక్కడే అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అతడికి కుశాల్‌ పెరీరా(29; 24 బంతుల్లో 4x4), తిసారా పెరీరా(27, 23 బంతుల్లో 2x6) సహకారం అందించడంతో కనీసం మూడెంకల స్కోర్‌ సాధించింది. మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ రెండంకెల పరుగులు చెయ్యలేదు.

తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ లాహిరు తిరమానె(4) హెన్రీ బౌలింగ్‌తో ఎల్బీగా వెనుతిరగడంతో కెప్టెన్‌ కరుణరత్నే, కుశాల్‌ పెరీరా ఆదుకునే ప్రయత్నం చేశారు. ప్రమాదకరంగా మారుతున్నఈ జోడిని మరోసారి హెన్రీ విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్టు పెవిలియన్‌ బాటపట్టగా ఎనిమిదో ఆటగాడిగా వచ్చిన తిసారా పెరీరా రెండు సిక్సులతో అలరించాడు. దీంతో శ్రీలంక 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తిచేసింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గుసన్‌ మూడేసి వికెట్లతో చెలరేగగా, ట్రెంట్‌బౌల్ట్‌, గ్రాండ్‌హోమ్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories