చెన్నై హ్యాట్రిక్‌ విజయాలకు ముంబై బ్రేక్‌

చెన్నై హ్యాట్రిక్‌ విజయాలకు ముంబై బ్రేక్‌
x
Highlights

చెన్నై హ్యాట్రిక్‌ విజయాల జోరుకు ముంబై బ్రేకులు వేసింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ చెలరేగిపోయింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ పటిష్ఠమైన చెన్నైకి చెక్...

చెన్నై హ్యాట్రిక్‌ విజయాల జోరుకు ముంబై బ్రేకులు వేసింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ చెలరేగిపోయింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ పటిష్ఠమైన చెన్నైకి చెక్ పెట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్‌), కృనాల్‌ పాండ్యా (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులకే పరిమితమైంది. లీగ్‌లో ముంబైకిది రెండో గెలుపు కాగా.. చెన్నైకి తొలి ఓటమి.

Show Full Article
Print Article
Next Story
More Stories