ధోని లక్ష రూపాయల విరాళం.. నెటిజన్ల ట్రోల్స్

ధోని లక్ష రూపాయల విరాళం.. నెటిజన్ల ట్రోల్స్
x
Dhoni (File Photo)
Highlights

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నడం బిగించిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నడం బిగించిన సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలకి తోడుగా సినీ, రాజకీయ, క్రీడా రంగంకి చెందినవారు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ఇందులో క్రీడా రంగంకి చెందినవారలో సచిన్ టెండూల్కర్ 50 లక్షలు, గంగూలీ 50 లక్షలు.. పీవీ సింధు 10 లక్షలు చేశారు. ఇక తాజాగా ఇండియన్ మాజీ కెప్టెన్, భారత క్రికెటర్ ధోని ముందుకు వచ్చాడు.

పూణేలోని పేదలకు ఆదుకునేందుకు ప్రముఖ ఫండ్ రైసింగ్ సంస్థ కృషి చేస్తుంది. అయితే ఈ సంస్థకుగాను ధోని లక్ష రూపాయల మొత్తాన్ని అందించాడు. ఇక సదరు సంస్థ 12 లక్షల 50 వేల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానికి గాను ధోనీ లక్ష రూపాయలు సాయం చేశాడు. దీనితో ధోని ఫాన్స్ సూపర్ అంటుంటే మరికొందరు మాత్రం ధోనిని ట్రోల్స్ చేస్తున్నారు. క్రికెట్‌ ద్వారా వందల కోట్లు సంపాదించే ధోని కూడా కేవలం లక్ష రూపాయాలు ఇవ్వడం తగునా అని విమర్శిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories