Top
logo

ధోనీకి షాకిచ్చిన బీసీసీఐ..ధోనీ రిటైర్మెంట్‌కు బీసీసీఐ సంకేతాలు

ధోనీకి షాకిచ్చిన బీసీసీఐ..ధోనీ రిటైర్మెంట్‌కు బీసీసీఐ సంకేతాలు
X
ధోనీకి షాకిచ్చిన బీసీసీఐ
Highlights

ధోనీ రిటైర్మెంట్‌కు బీసీసీఐ పరోక్షంగా సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల నూతన వార్షిక కాంట్రాక్టుల...

ధోనీ రిటైర్మెంట్‌కు బీసీసీఐ పరోక్షంగా సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల నూతన వార్షిక కాంట్రాక్టుల జాబితాలో ధోనీ పేరు లేకపోవడం అందుకు బలాన్ని చేకూర్చినట్లయ్యింది. అన్ని ఫార్మాట్లలో ఇండియా టీమ్‌ను ధోనీ ప్రథమస్థానంలో నిలిపారు. ధోనీ కెప్టెన్సీలో వన్డే, టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.

బీసీసీఐ గురువారం భారత జట్టు సీనియర్‌ ఆటగాళ్ల వార్షిక ఆదాయ ఒప్పందాల్ని ప్రకటించింది. ఈ జాబితాను నాలుగు భాగాలుగా విభజించారు. అక్టోబర్‌ 2019 నుంచి సెప్టెంబర్‌ 2020 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. గ్రేడ్‌ ఏ+ ఆటగాళ్లకు 7 కోట్లు ఇవ్వనుండగా, గ్రేడ్‌ ఏ ఆటగాళ్లకి 5 కోట్లు, గ్రేడ్‌ బి వారికి 3 కోట్లు, గ్రేడ్‌ సి వారికి కోటి చొప్పున చెల్లించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

ఏ+ కాంట్రాక్టులో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా ఉండగా.. గ్రేడ్ ఏలో అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, రాహుల్, ధవన్, షమి, ఇషాంత్, కుల్దీప్, పంత్‌ ఉన్నారు. ఇక బీ గ్రేడ్‌లో సాహా, ఉమేశ్, చాహల్, పాండ్యా, మయాంక్‌... సీ గ్రేడ్‌లో జాదవ్, సైనీ, చాహర్, మనీశ్ పాండే, విహారీ, శ్రేయాస్, వాషింగ్టన్ సుందర్‌ ఉన్నారు.

Web TitleMS Dhoni dropped from BCCI annual player contract lists
Next Story