మిల్లర్ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

మిల్లర్ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
x
Highlights

వరుసగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తమ టీమ్ ను మిల్లర్, ఫెలుక్‌వాయో ఆదుకున్నారు. మెల్లగా ఒక్కో పరుగు చేస్తూ మరో వికెట్ పడకుండా కాపాడారు. ఈ...

వరుసగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తమ టీమ్ ను మిల్లర్, ఫెలుక్‌వాయో ఆదుకున్నారు. మెల్లగా ఒక్కో పరుగు చేస్తూ మరో వికెట్ పడకుండా కాపాడారు. ఈ జోడీని విడదీయడానికి బుమ్రా ను మరో మారు ప్రయోగించాడు కోహ్లీయే. అయినా ఫలితం కనబడలేదు. తరువాత భువిని రంగం లోకి దించాడు. పరుగుల వేగాన్ని నిరోధించగలిగారు కానీ.. వికెట్ తీయలేకపోయారు. అయితే, 36 వ ఓవర్లో చాహల్ మళ్ళీ విజృంభించాడు. ప్రమాదకరంగా ఆడుతున్న మిల్లర్ ను కేచ్ అండ్ బౌల్డ్ గా వెనక్కి పంపాడు. దీంతో దక్షిణాఫ్రికా మరో మారు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇదే కొనసాగితే 150 పరుగులూ కష్టమే ఆ జట్టుకి. ప్రస్తుతం 36 ఓవర్లలో ఆరు వికెట్లకి 138 పరుగులు మాత్రమే చేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories