టీమిండియా మ్యాచ్ లో ప్రత్యేక అతిథి!

టీమిండియా మ్యాచ్ లో ప్రత్యేక అతిథి!
x
Highlights

సూపర స్టార్ మహేష్ బాబుకు క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. అయితే, ఇప్పటివరకూ ఎక్కడా క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి వెళ్లినట్టు తెలియలేదు. ఇపుడు కొడుకు గౌతమ్...


సూపర స్టార్ మహేష్ బాబుకు క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. అయితే, ఇప్పటివరకూ ఎక్కడా క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి వెళ్లినట్టు తెలియలేదు. ఇపుడు కొడుకు గౌతమ్ కోసం ఈ టాలీవుడ్ అగ్రహీరో మైదానానికి రాక తప్పలేదు. ప్రస్తుతం కుటుంబంతో ఫారెన్ టూర్లో ఉన్న మహేష్ బాబు ఆదివారం జరుగుతున్న మ్యాచ్ తన కుమారుడు గౌతమ్ తో కలిసి ప్రత్యక్షమయ్యాడు.

ఇద్దరూ కలిసి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మ్యాచ్ ను హాయిగా ఆస్వాదిస్తూ ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. మా అబ్బాయి కోసం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కు వచ్చానంటూ మహేశ్ తన సెల్ఫీకి క్యాప్షన్ పెట్టాడు. దీన్ని మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేయగా, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories