రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్న మలింగ

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ 20 మ్యాచ్ ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని మలింగ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే..
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ లసిత్ మలింగ తన రిటైర్మెంట్ ని వెనుకకి తీసుకున్నాడు. మరో రెండేళ్లు క్రికెట్ ఆడాలని అనుకున్నట్టుగా చెప్పాడు మలింగ.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ 20 మ్యాచ్ ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని మలింగ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.. తన రిటైర్మెంట్ వెనుకకి తీసుకున్న నేపథ్యంలో మలింగ మాట్లాడుతూ "నేను చాలా టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడాను. ఇందులో మొత్తం నాలుగు ఓవర్లు మాత్రమే కాబట్టి, నాకున్న నైపుణ్యంతో మరో రెండేళ్ళు అడగలనని అనిపిస్తుందని అన్నాడు మలింగ.. ఇక జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడంపై బోర్డు నుంచి స్పష్టత రావాల్సి ఉందని"అన్నాడు. 36 ఏళ్ల మలింగ తానూ ఆడినా టీ ట్వంటీ మ్యాచ్ లలో వంద వికెట్లు తీసిన ఫేసర్ గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా టీ 20 మ్యాచ్ లో వరుసగా ఐదుసార్లు హ్యాట్రిక్ తో పాటు, వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు మలింగ ...
లైవ్ టీవి
మహేష్ అబ్బురపరిచే ఫీట్.. టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు
10 Dec 2019 4:00 PM GMTరేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
10 Dec 2019 3:22 PM GMTపరాయి మహిళలను అమ్మ లేదా అక్కచెల్లెలుగా చూడాలి : హరీష్
10 Dec 2019 3:09 PM GMTఢిల్లీకి సజ్జనార్.. నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టులో...
10 Dec 2019 3:06 PM GMTటాయిలెట్ లోనే మూడేళ్లుగా ఆ వృద్ధురాలు నివాసం
10 Dec 2019 2:58 PM GMT