కుల్దీప్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌

కుల్దీప్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌
x
Highlights

న్యూజిలాండ్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లో టీమిండియా 1-2తో ఓడినా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన కెరియర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు....

న్యూజిలాండ్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లో టీమిండియా 1-2తో ఓడినా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన కెరియర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండు టీ-20 మ్యాచ్ లకు దూరంగా ఉన్న కుల్దీప్ హామిల్టన్ వేదికగా ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా 2 వికెట్లు పడగొట్టడంతో పాటు తన ర్యాంక్ ను ప్రస్తుత 3వ స్థానం నుంచి రెండో స్థానానికి మెరుగుపరచుకోగలిగాడు. ఐసీసీ టీ-20 బౌలర్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం అప్ఘాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్ ర్యాంకర్ గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో 24 ఏళ్ల కుల్దీప్ యాదవ్ నిలిచాడు. ఇక బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఏడు, ఓపెనర్ శిఖర్ ధావన్ 11 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. టీ-20 టీమ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, టీమిండియా మొదటి మూడుర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్ నాలుగు, ఇంగ్లండ్ ఐదు ర్యాంకులు సాధించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories