సొంతగడ్డపై వరుసగా రెండో విజయం నమోదు చేసిన కోల్‌కతా

సొంతగడ్డపై వరుసగా రెండో విజయం నమోదు చేసిన కోల్‌కతా
x
Highlights

సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 28 పరుగుల తేడాతో...

సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 28 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. రాబిన్‌ ఉతప్ప (50 బంతుల్లో 67 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్‌ రాణా (34 బంతుల్లో 63; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) మూడో వికెట్‌కు 66 బంతుల్లో 110 పరుగులు జోడించి భారీ స్కోరు సాధించారు...

అలాగే ఆండ్రీ రసెల్‌ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిపించాడు. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు. పంజాబ్ బౌలర్లు మహమ్మద్ సమీ , వరుణ్ చక్రవర్తి, హర్డ్స్ , టై తలో వికెట్ తీశారు. అనంతరం 219 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసి ఓటమి పాలైంది. పంజాబ్ ఆటగాళ్లలో డేవిడ్‌ మిల్లర్‌ (40 బంతుల్లో 59 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మయాంక్‌ అగర్వాల్‌ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు చేసినా జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories