Top
logo

పంజాబ్ ముందు భారీ లక్షాన్ని ఉంచిన కోల్‌కతా

పంజాబ్ ముందు భారీ లక్షాన్ని ఉంచిన కోల్‌కతా
X
Highlights

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2019 భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్‌...

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2019 భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బుధవారం స్థానిక ఈడెన్‌ గార్డెన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పంజాబ్‌ జట్టు. బ్యాటింగుకు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ చేసి.. పంజాబ్ ముందు భారీ లక్షాన్ని ఉంచింది.

కోల్‌కతా ఆటగాళ్లలో రాబిన్ ఉతప్ప 50 బంతుల్లో 67 పరుగులు, నితీష్ రానా 34 బంతుల్లో 63 పరుగులు చేశారు, అలాగే రస్సెల్ 48 పరుగులు చేయడంతో కోల్‌కతా స్కోర్ పరుగులు పెట్టింది. పంజాబ్ బౌలర్లు మహమ్మద్ సమీ , వరుణ్ చక్రవర్తి, హర్డ్స్ , టై తలో వికెట్ తీశారు. 219 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆదిలోనే కెఎల్ రాహుల్ వికెట్ ను చేజార్చుకుంది.

Next Story