ఒకేఒక్కడు కోహ్లి.. ఐసీసీ అవార్డులు క్లీన్‌స్వీప్‌

ఒకేఒక్కడు కోహ్లి.. ఐసీసీ అవార్డులు క్లీన్‌స్వీప్‌
x
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు ఐసీసీ అవార్డులు గెలుచుకోడంలోనూ తనకుతానే సాటిగా నిలిచాడు. క్రికెట్ చరిత్రలోనే...

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు ఐసీసీ అవార్డులు గెలుచుకోడంలోనూ తనకుతానే సాటిగా నిలిచాడు. క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్ అవార్డుతో పాటు ఐసీసీ వన్డే, ఐసీసీ టెస్ట్ క్రికెట్ అవార్డులకు సైతం ఎంపికయ్యాడు. 2018 సిరీస్ లో కొహ్లీ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ విశ్వరూపమే ప్రదర్శించాడు. 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ మధ్య జరిగిన టెస్టులు, వన్డేల ప్రాతిపదికన ఈ అవార్డులను ప్రకటించారు. కొహ్లీ నాయకత్వంలో ఆరు టెస్టులు నెగ్గి, ఏడు టెస్టుల్లో ఓటమి పొందిన టీమిండియా వన్డేలలో 9 విజయాలు, 4 పరాజయాలు చవిచూసింది. ఓ మ్యాచ్ ను టైగా ముగించింది. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కింద కొహ్లీకి సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని వరుసగా రెండో ఏడాది ఐసీసీ బహుకరించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories