కెప్టెన్ గా ధోనిని దాటేసిన కోహ్లి

కెప్టెన్ గా ధోనిని దాటేసిన కోహ్లి
x
Highlights

గ్రౌండ్ లోకి అడుగుపెడితే చాలు పరుగుల మోత మోగిస్తాడు కోహ్లి.. ప్రత్యర్దులకి కోహ్లిని ఎప్పుడెప్పుడు అవుట్ చేద్దామా అన్నట్టుగానే ఉంటారు.

గ్రౌండ్ లోకి అడుగుపెడితే చాలు పరుగుల మోత మోగిస్తాడు కోహ్లి.. ప్రత్యర్దులకి కోహ్లిని ఎప్పుడెప్పుడు అవుట్ చేద్దామా అన్నట్టుగానే ఉంటారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో తన పేరిట చాలా రికార్డులును నెలకోల్పాడు విరాట్ కోహ్లి. ఇప్పుడు తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా మాజీ కెప్టెన్ ఎంయస్ ధోని పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు కోహ్లి.. అంతేకాకుండా అత్యంత వేగంగా అయిదు వేల పరుగులను పూర్తి చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు కోహ్లి. ఇక ఇది కూడా ధోని పేరు మీదనే ఉంది.

బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 89 పరుగులు చేసిన కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 199 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. 11,208 పరుగులు చేశాడు. ఇక ధోనీ 330 ఇన్నింగ్స్‌ల్లో 11,207 పరుగులు చేశాడు. దీనితో ఇప్పుడు కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి, ధోని తరవాత స్థానాలలో భారత మాజీ క్రికెటర్స్ అజారుద్దీన్ , సౌరవ్ గంగూలీ ఉన్నారు. ఇక అంతర్జాతీయంగా కోహ్లి, ధోని తర్వాత ఆస్ట్రేలియా నుంచి పాంటింగ్, దక్షిణాప్రికా నుంచి స్మిత్ ఉన్నారు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించడంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కి 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ కొత్త సంవత్సరంలో భారత్ కి ఇది రెండో సిరీస్ విజయం ఇది.. అంతకుముందు శ్రీలంక జట్టుతో తలపడి మొదటి సిరీస్ ని గెలుచుకుంది. భారత జట్టు ఆ తర్వాతి న్యూజిలాండ్ జట్టుతో సిరీస్ న్యూజిలాండ్ పర్యటన కోసం వెళ్లనుంది. ఈనెల 24 నుంచి కివీస్ గడ్డపై ఐదు టీ20ల సిరీస్‌ను ఆడుతుంది. అనంతరం మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories