ప్రపంచ కప్ లో కోహ్లీ బౌలింగ్ చూడబోతున్నామా?

ప్రపంచ కప్ లో కోహ్లీ బౌలింగ్ చూడబోతున్నామా?
x
Highlights

ప్రపంచకప్‌ 2019 సాధించాలనే కసితో టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతోంది. అన్ని విభాగాల్లోనూ టీమిండియా ఆటగాళ్ళు విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు....

ప్రపంచకప్‌ 2019 సాధించాలనే కసితో టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతోంది. అన్ని విభాగాల్లోనూ టీమిండియా ఆటగాళ్ళు విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ కెప్టెన్ కోహ్లీ నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్వీటర్‌లో షేర్‌ చేసింది. అదిపుడు వైరల్ గా మారింది.

'టీమిండియాకు ఆరో బౌలర్‌ దొరికాడోచ్‌', 'ప్రపంచకప్‌లో కోహ్లి మరో అవతారం ఎత్తునున్నాడు', 'కేదార్‌ జాదవ్‌ అందుబాటులో లేకుంటే అతడి బౌలింగ్‌ కోటాను కోహ్లితో భర్తీ చేయించవచ్చు'అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

కోహ్లి బౌలింగ్‌ చేస్తున్న వీడియోతో పాటు టీమిండియా ఆటగాళ్లకు సహాయక కోచ్‌ శ్రీధర్‌ ఫీల్డింగ్‌ డ్రిల్‌ను నిర్వహించిన మరో వీడియోను కూడా బీసీసీఐ షేర్‌ చేసింది. క్యాచ్‌లు ప్రాక్టీస్‌ చేయడం, వికెట్లకు నేరుగా బంతిని వేయటం వంటివి ప్రాక్టీస్‌ చేశారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి పోరులో జూన్‌5న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories