కేరళలో తెలుగు 'సింధూ'రానికి సత్కారం

కేరళలో తెలుగు సింధూరానికి సత్కారం
x
Highlights

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​ విజేతగా నిలిచిన సింధును కేరళ రాష్ట్రప్రభుత్వం సత్కరించింది. ఆ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రూ. 10 లక్షల...

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​ విజేతగా నిలిచిన సింధును కేరళ రాష్ట్రప్రభుత్వం సత్కరించింది. ఆ రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం జరిగిన సన్మాన సభలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సింధు ఖ్యాతిని కొనియాడారు. ఆటలో సింధూ పోరాట పటిమను చూసి యువత ఆదర్శంగా నిలవాలని పినరయి విజయన్​ చెప్పారు. కేరళ రాష్ట్ర క్రీడాభివృద్ధిలో సింధు భాగం కావాలని కేరళ సీఎం కోరారు.

బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీసింధు.. కేరళలో ప్రముఖ ఆలయాలను సందర్శించారు. అనంత పద్మనాభస్వామి, అట్టుక్కల్ భగవతి ఆలయాలో ప్రత్యేక పూజలుచేశారు. కేరళ సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. ఆమెతో పాటు తల్లి విజయ కూడా ఉన్నారు. కేరళలో సింధూకు రోడ్ షో నిర్వహించి ఘనంగా ఆహ్వానించారు. తర్వాత కేరళ ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మానసభకు బయల్దేరింది సింధు. రోడ్​ షోలో అడుగడుగునా విద్యార్థులు ఆమెను ఘనంగా ఆహ్వానించారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని సింధుకు జేజేలు పలికారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories