రికార్డుకి ఒక వికెట్ దూరంలో బుమ్రా

రికార్డుకి ఒక వికెట్ దూరంలో బుమ్రా
x
Bumrah
Highlights

సొంతగడ్డలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ ని ఆడుతుంది భారత్.. ఇందులో తొలి టీ20 రద్దయినప్పటికి ఇండోర్‌లో జరిగిన రెండో

సొంతగడ్డలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ ని ఆడుతుంది భారత్.. ఇందులో తొలి టీ20 రద్దయినప్పటికి ఇండోర్‌లో జరిగిన రెండో టీ20లో మాత్రం విజయం సాధించి1-0 సీరిస్ లో ముందంజలో ఉంది. ఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణేలో మూడో టీ 20 మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సీరీస్ ని కైవసం చేసుకోవాలని భారత జట్టు ఉంటే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని సమం చేయాలనీ శ్రీలంక జట్టు ఆశిస్తుంది. ఈ రసవత్తర పోరుకు పూణే వేదిక కానుంది.

ఇక ఇది ఇలా ఉంటే గత మ్యాచ్ తో టీంలోకి రీఎంట్రీ ఇచ్చాడు భారత పేస్ బౌలర్ బుమ్రా.. వెన్నుముక గాయంతో జట్టులో స్థానం కోల్పోయిన బుమ్రా ఈ మ్యాచ్ లో అనుకున్నంతగా రాణించలేకపోయాడు. మొత్తం ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా ఒక్క వికెట్ మాత్రమే తియగాలిగాడు. అయితే ఇప్పుడు బుమ్రా ఒక్క వికెట్ తీయగలిగితే భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. అయితే ఈ ఫీట్ ని బుమ్రా జరగబోయే పుణె టీ20లో అధిగామిస్తాడా లేదా అన్నది చూడాలి.

2016లో అంతర్జాతీయ టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా ఇప్పటి వరకూ 43 మ్యాచ్‌ లలో 52 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో యుజ్వేందర్ చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు బుమ్రా కూడా సరిగ్గా 52 వికెట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు పుణె టీ20లో ఒక్క వికెట్ తియగలిగితే వారి రికార్డును బద్దలుకొట్టినవాడు అవుతాడు.

ఇక మూడో టీ 20 మ్యాచ్ కి భారత జట్టు అంచనా ఇలా ఉంది

విరాట్ కోహ్లీ (కెప్టెన్), లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, జస్‌ప్రీత్ బుమ్రా.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories