టీమిండియా కెప్టెన్ మార్పు జరగనుందా? వన్డేలకు రోహిత్.. టెస్ట్ మ్యాచ్ లకు కోహ్లీ?

టీమిండియా కెప్టెన్ మార్పు జరగనుందా? వన్డేలకు రోహిత్.. టెస్ట్ మ్యాచ్ లకు కోహ్లీ?
x
Highlights

భారత క్రికెట్ జట్టు ప్రక్షాళన జరగనుందా? పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. వరల్డ్ కప్ లో అనూహ్య ఓటమి తరువాత టీమిండియా జట్టు కూర్పు పై అన్ని వర్గాల నుంచి...

భారత క్రికెట్ జట్టు ప్రక్షాళన జరగనుందా? పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. వరల్డ్ కప్ లో అనూహ్య ఓటమి తరువాత టీమిండియా జట్టు కూర్పు పై అన్ని వర్గాల నుంచి విమర్శలు తలెత్తాయి. అదేవిధంగా సెమీఫైనల్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలోనూ అనేక విమర్శలు వినిపించాయి. ఇవన్నీ మామూలుగానే తీసుకున్నా.. బిసిసిఐ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉంది. దీంతో కచ్చితంగా భారత జట్టు వెస్టిండీస్ టూర్ ముగిసేటప్పటికి పెను మార్పులకు లోనవుతుందని క్రీడా పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా కెప్తెన్సీ విషయంలో పెద్ద మార్పే చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఆదిశలో బీసీసీఐ సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. వచ్చే టీ20 వరల్డ్ కప్, 2023 వరల్డ్ కప్ రెండిటినీ దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ ను మార్చాలని భావిస్తున్నారట. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ స్థానంలో రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇక టెస్ట్ లకు కోహ్లీ సారధ్యం వహించే అవకాశం ఉంది. వరల్డ్ కప్ లక్ష్యంగా ఇప్పటినుంచే టీం తయారు చేసుకోవాలని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుండడంతో కచ్చితంగా కప్ గెలిచే విధంగా సన్నద్ధం కావాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మాజీలు కూడా కోహ్లీ కెప్టెన్సీ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories