ఆర్చర్ ఈ ఫైనల్ ను ఏళ్ల క్రితమే ఊహించాడా?

ఆర్చర్ ఈ ఫైనల్ ను ఏళ్ల క్రితమే ఊహించాడా?
x
Highlights

ఒక్కోసారి కాకతాళీయంగా చేసిన పని తర్వాతి రోజుల్లో పెద్ద విశేషంగా మారవచ్చు. ఎందుకో అని రాసిన నాలుగు మాటలు తర్వాతి కాలానికి సరిగ్గా సరిపడేలా...

ఒక్కోసారి కాకతాళీయంగా చేసిన పని తర్వాతి రోజుల్లో పెద్ద విశేషంగా మారవచ్చు. ఎందుకో అని రాసిన నాలుగు మాటలు తర్వాతి కాలానికి సరిగ్గా సరిపడేలా మారిపోవచ్చు.. దీనికి సూపర్ పవర్ అనో.. మరోటో నో పేర్లు పెట్టుకుని చెప్పుకోవడమే మనం చేయాల్సింది. సరిగ్గా ఇటువంటి పనే ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చర్ చేశాడు. నేట్టింట్లో ట్రెండీ గా మారిన అదేంటో మీరూ ఓ లుక్కేయండి.

ఆర్చర్..గత నిన్నటినుంచీ ప్రతి క్రికెట్ అభిమాని నోట్లోనూ నానుతున్న పేరు. ఇంగ్లాండ్ తరఫున వరల్డ్ కప్ లో ప్రధాన బౌలర్ గా ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన బౌలర్. కొన్ని సార్లు ఆర్చర్ బౌలింగ్ చూసి భయపడ్డ బ్యాట్స్ మెన్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తన బౌలింగ్ మాయతో ౨20 వికెట్లు టోర్నీ మొట్టమ మీద తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇదంతా ఒకెత్తు అయితే, ఆర్చర్ ఇప్పుడు మరోవిధంగా ప్రజల నోట్లో నానుతున్నాడు.

ఆర్చర్ కు సూపర్ పవర్స్ ఉనాయా? ఇదే ప్రశ్న అందరి మదినీ తొలిచేస్తోంది. ఆర్చర్ ట్విట్టర్ లో గతంలో అతను చేసిన ట్వీట్లకు.. ప్రపంచ కప్ లో జరిగిన సంఘటనలకు.. చాలా సారూప్యాలు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు నేట్టింట్లో సంచలనం గా మారింది.

అపుడెపుడో 2014 లో 16 ఫ్రం 6 అని ట్వీట్ చేశాడు. నిన్న జరిగిన ఫైనల్స్ లో సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ విజయలక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు.. ఆగండాగండి.. ఎదో ఎప్పుడో చేసింది తీసుకొచ్చి ఇలా ముడిపెట్టేస్తారా అని అనేయకండి..ఇంకా చాలా ఉంది.. న్యూజిలాండ్ ఈ మ్యాచ్ ఎలా ఓడిపోయింది? అంటూ 2014 మార్చిలో ఓ ట్వీట్ పెట్టాడు.. ఇదేనా.. ఇంకా చాలా.. 2015 ఆగస్టులో వాట్ ఎ స్టుపిడ్ రూల్ దిస్? అనీ.. అదే సంవత్సరం జూలై నెలలో వుడింట్ మైండ్ ఎ సూపర్ ఓవర్ అనీ.. 2014 డిసెంబర్ లో ఆల్వేస్ గుడ్ గేమ్ న్యూజిలాండ్ అనీ.. ఇలా చాలా ట్వీట్ లు చేశాడు. అవి అతను ఎందుకు అలా చేశాడో తెలీదు కానీ, ఇప్పుడు జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ పరిస్థితులకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. దీంతో నెటిజన్లు ఆర్చర్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. సూపర్ పవర్ ఉందని ఒకరు.. నువ్వో ప్రత్యేకమైన వాడివి అని ఒకరు.. ఇలా రకరకాలుగా ఆ ట్వీట్ లకు కామెంట్లు పెడుతూ రీపోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అభిమానుందరికీ ఈ వరల్డ్ కప్ ఫైనల్ ను ముందే ఊహించే ఆర్చర్‌ ట్వీట్‌ చేశాడా అనేది అభిమానులకు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

ఆర్చర్ అప్పట్లో సంధించిన ట్వీట్ లు మీరూ చూసి ఏమనుకుంటారో మీ ఇష్టం... మీకోసం ఆ లింక్స్...







Show Full Article
Print Article
More On
Next Story
More Stories