70 పరుగులకే కుప్పకూలిన కోహ్లీసేన

70 పరుగులకే కుప్పకూలిన కోహ్లీసేన
x
Highlights

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌...

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌ ఆరంభించింది. అయితే చెన్నై బౌలర్లకు కోహ్లీ సేన 70 పరుగులకే కుప్పకూలింది. కేవలం 12 బంతులే ఆడిన కోహ్లీ 6 పరుగులు చేసి హర్భజన్ సింగ్ బౌలింగ్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు..

ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఏ ఒక్కరూ కూడా నిలదొక్కుకోలేకపోయారు. వరుసబెట్టి ఆటగాళ్లందరూ పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ పార్థివ్ పటేల్(29) మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్ చేయలేదు. చెన్నై బౌలర్లలో హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్ ధాటికి కోహ్లీ సేన చేతులెత్తేసింది. వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే రవీద్ర జడేజా 2 , బ్రేవో 1 వికెట్లు తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories