ఇండియాలోనే ఐపీఎల్.. మార్చి 23న ప్రారంభం

IPL
x
IPL
Highlights

ఐపీఎల్ 12వ సీజన్ పోటీలను భారత్ వేదికగానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా విదేశీగడ్డపై నిర్వహించే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి ఐపీఎల్ గవర్నింగ్ బాడీ తెరదించింది.

ఐపీఎల్ 12వ సీజన్ పోటీలను భారత్ వేదికగానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా విదేశీగడ్డపై నిర్వహించే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి ఐపీఎల్ గవర్నింగ్ బాడీ తెరదించింది. మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా 10 నగరాలు వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. వివిధ ఫ్రాంచైజీల యాజమాన్యాలతో చర్చించిన తర్వాతే లీగ్ తేదీలను అధికారికంగా ఖరారు చేయనున్నారు.

పింక్ సిటీ జైపూర్ వేదికగా ఇటీవలే నిర్వహించిన ఐపీఎల్ వేలంలో ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెరో 8 కోట్ల 50 లక్షల రూపాయల కాంట్రాక్టు దక్కించుకొన్నారు. యువఆటగాడు శివం దుబేకు ఐదుకోట్ల రూపాయలు, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్ లు సైతం చెరో ఐదుకోట్ల రూపాయల కాంట్రాక్టు సాధించారు. బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్, ఆరోన్ ఫించ్ లను వివిధ ఫ్రాంచైజీలు ఏమాత్రం పట్టించుకోకపోడం విశేషం. విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ శామ్ కరెన్ కు 7 కోట్ల 20 లక్షల రూపాయల అత్యధిక ధర పలికింది.

Show Full Article
Print Article
Next Story
More Stories