హాట్స్ ఆఫ్ : అప్పుడు కుంబ్లే .. ఇప్పుడు కారీ ..

హాట్స్ ఆఫ్ : అప్పుడు కుంబ్లే .. ఇప్పుడు కారీ ..
x
Highlights

రెండో సెమిస్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ ఆటగాడు అలెక్స్ కారీ దవడకు గాయం తగిలింది . స్మిత్ తో కలిసి ఇన్నింగ్స్ ని కొనసాగించిన కారీ ఎనిమిదో...

రెండో సెమిస్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ ఆటగాడు అలెక్స్ కారీ దవడకు గాయం తగిలింది . స్మిత్ తో కలిసి ఇన్నింగ్స్ ని కొనసాగించిన కారీ ఎనిమిదో ఓవర్ లో ఆర్చర్ వేసిన బంతికి గాయపడ్డాడు .. బంతి నేరుగా అతని దవడకు తాకడంతో ఆటగాళ్ళు అందరు బయపడ్డారు కానీ అతను మాత్రం తల చుట్టూ బ్యాండేజ్ చుట్టుకొని చిరునవ్వుతోనే మైదానాన్ని వీడకుండా తన ఆటను కొనసాగించాడు .. స్మిత్ తో కలిసి వంద పరుగులు జోడించి 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు ..

ఇలాంటి సంఘటనే 2002 లో చోటు చేసుకుంది . భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వెస్టిండిస్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇలాగే గాయపడ్డాడు .. విండిస్ బౌలర్ డిల్లాన్ వేసిన బంతి కుంబ్లే దవడని గట్టిగా తాకింది . కానీ కుంబ్లే బ్యాండేజ్ వేసుకొని మరి ఆటలోకి దిగాడు .. బౌలింగ్ కూడా వేసి విండిస్ కీలక ఆటగాడు బ్రియాన్ లారా(4) వికెట్ తీసి వావ్ అనిపించాడు. వీరిద్దరికీ అంతా పెద్ద గాయం తగిలిన అట మీదా దేశం మీదా ఉన్న ప్రేమతో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories