టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
x
Highlights

వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం జరుగుతున్న టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ప్రస్తుతం 11 పాయింట్లతో...

వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం జరుగుతున్న టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ప్రస్తుతం 11 పాయింట్లతో ఉంది. అటు బంగ్లా ఏడు పాయింట్లతో ఉంది. ఈ జట్టు నాకౌట్‌ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌తో పాటు పాక్‌పైనా నెగ్గాలి. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ రోజు మ్యాచ్‌లో టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. కేదార్‌ జాదవ్‌కి బదులు దినేశ్‌కార్తీక్‌ బరిలో దిగుతుండగా కుల్‌దీప్‌కి బదులు భువనేశ్వర్‌కు అవకాశమొచ్చింది.

భారత్‌: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, దినేశ్‌ కార్తీక్‌, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, బుమ్రా, చహల్‌

బంగ్లాదేశ్‌: మష్రాఫ్‌ మొర్తజా(కెప్టెన్‌), తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకీబుల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటాన్‌ దాస్‌, మొసదెక్‌ హుస్సేన్‌, షబ్బీర్‌ రహ్మాన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌, రూబెల్‌ హుస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories