సిరీస్ పైన కన్నేసిన టీంఇండియా

సిరీస్ పైన కన్నేసిన టీంఇండియా
x
టీం ఇండియా
Highlights

ఆదివారం రాత్రి తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్ జరగనున్న రెండో టీ20మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది భారత జట్టు.

ఆదివారం రాత్రి తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్ జరగనున్న రెండో టీ20మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది భారత జట్టు.. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్‌ని 1-1తో సమం చేయాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఉప్పల్ వేదికగా జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు భావిస్తుంది.

వెస్టిండీస్ అంత భారీ స్కోర్ సాధించినప్పటికీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఎక్కువగా అదనపు పరుగులు ఇవ్వడమే దీనికి కారణమని ఆ జట్టు కెప్టెన్ పోలార్డ్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. ఇక 208 భారీ లక్ష్యాన్ని అలవోకగా అందుకున్న భారత జట్టు అదే ఉపును రెండో టీ20లోనూ కూడా కొనసాగించుకోవాలని చూస్తుంది.

ఇక జట్టు బలాబలాల విషయానికి వస్తే ఓపెనర్ టీం ఇండియాకి ఓపెనర్స్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ప్రధాన బలం.. గత మ్యాచ్ లో రోహిత్ ఫెయిల్ అయినప్పటికీ, రాహుల్ ఆకట్టుకున్నాడు. ఇక కోహ్లి జట్టును ఎప్పుడు ముందుండి నడిపిస్తున్నాడు. ఇక మిడిలార్డర్‌లో రిషబ్ పంత్ ఒకే అనిపిస్తున్న కీలకమైన సమయంలో మాత్రం నిరశాపరుస్తున్నాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ కూడా ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా , భువనేశ్వర్ లాంటి హేమాహేమీలు ఉన్నారు. అయితే ఇందులో సుందర్ లేదా జడేజాపై వేటు వేసి మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని ఆడించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక వెస్టిండీస్ జట్టు విషయానికి వస్తే ఓపెనర్ ఎవిన్ లావిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో మళ్లీ జోరందుకున్నాడు. ఆ తర్వాత హిట్‌మెయర్, పొలార్డ్, జేసన్ హోల్డర్ లాంటి హిట్టర్స్ ఉండనే ఉన్నారు. కానీ సీనియర్ ఓపెనర్ సిమన్స్ నిరాశపరచడం ఆ జట్టు బాధిస్తోంది. ఇక బౌలింగ్‌లోనూ విలియమ్స్, హోల్డర్ లాంటి వాళ్ళు ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories