Ind vs WI 2nd T20 : విజయం దిశగా విండీస్

Ind vs WI 2nd T20 :  విజయం దిశగా విండీస్
x
India vs West Indies
Highlights

తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 జరుగుతోంది. 171 పరుగుల విజయ లక్ష్యంలో బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ కు ఓపెనర్లు శుభారంభాన్ని...

తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 జరుగుతోంది. 171 పరుగుల విజయ లక్ష్యంలో బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 73 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. బౌరత బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొన్న ఇద్దరూ 9.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వీడదీశాడు. ఎవిన్ లూయిస్ (40, 35 బంతుల్లో 3X4, 3X6 ) ఔటయ్యాడు. దీంతో 13 ఓవర్లు పూర్తి అయ్యేసరికి విండీస్ 112 పరుగులతో ఉంది. మరో ఓపెనర్ సిమన్స్ (45, 34 బంతుల్లో, 3X4, 2X6), హెట్‌మైర్ ( 17) పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (33, 22 బంతుల్లో 3X4, 1X6) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. శివమ్ దూబే (54, 30 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సులు) హేడెన్ వాల్ష్ బౌలింగ్ లో హెట్‌మైర్ క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. శివమ్ దూబే టీ20 కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. కోహ్లీ (19) పరుగులతో నిరాశపరిచాడు. కేస్రిక్ విలియమ్స్ బౌలింగ్ లో లెండిల్ సిమన్స్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. అనంతరం శ్రేయస్స్ అయ్యార్ (10) భారీ షాట్ కు యత్నించి వెనుదిరిగాడు. దీంతో భారీ స్కోరు దిశగా సాధిస్తుందనుకున్న భారత్ ను విండీస్ బౌలర్ల కట్టడి చేశారు.

దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయింది. 3.1 ఓవర్లలో జట్టు స్కోరు 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ రాహుల్ (11 పరుగులు, 11 బంతుల్లో, 1ఫోర్ ) చేసి ఖ్యారీ పిర్రే బౌలింగ్ లో హెట్‌మైర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి మ్యాచ్ లో రాణించిన రాహుల్ ఈ మ్యాచ్ లో స్వల్ప పరుగులకే ఔటైయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ( 15 పరుగులు,18బంతుల్లో,2 ఫోర్లు) పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విండీస్ బౌలర్లలో కేస్రిక్ విలియమ్స్, హేడెన్ వాల్ష్ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. జాసన్ హోల్డర్, ఖ్యారీ పిర్రే, జాసన్ హోల్డర్ తల ఒక వికెట్ దక్కించుకున్నారు.

హైదరాబాద్ వేధికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు టీమిండియా 6వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories