పాకిస్థానీ కెప్టెన్‌కి మెదడు లేదా? : సర్ఫరాజ్‌పై మండిపడ్డ షోయబ్ అక్తర్‌

పాకిస్థానీ కెప్టెన్‌కి మెదడు లేదా? : సర్ఫరాజ్‌పై మండిపడ్డ షోయబ్ అక్తర్‌
x
Highlights

పాకిస్థానీ కెప్టెన్‌కి మెదడు లేదా? ఇపుడిదే సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతుంది. రెండు దేశాల మధ్య భావోద్వేగాలు నెలకొన్న పరిస్థితుల్లో ఫీల్డింగ్‌లో ఉంటూ...

పాకిస్థానీ కెప్టెన్‌కి మెదడు లేదా? ఇపుడిదే సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతుంది. రెండు దేశాల మధ్య భావోద్వేగాలు నెలకొన్న పరిస్థితుల్లో ఫీల్డింగ్‌లో ఉంటూ ఆవలిస్తూ చులకనయ్యారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. సర్ఫరాజ్‌ మెదడు లేని కెప్టెన్‌ అంటూ తూర్పారపడుతున్నారు.పాకిస్థాన్ కెప్టెన్ స‌ర్ఫరాజ్ అహ్మాద్‌పై తీవ్ర విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశ మాజీ క్రికెట‌ర్లే అత‌నిపై దుమ్మెత్తిపోస్తున్నారు. టాస్ గెలిచిన త‌ర్వాత బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకున్న నిర్ణయంపై మెదడు లేని కెప్టెన్‌ అంటూ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయబ్ అక్తర్‌ విమర్శించాడు. ట్విట్టర్‌లో, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సర్పరాజ్‌ ఆట పేలవంగా ఉందని అతన్ని ఎగతాళి చేస్తూ ట్విట్టర్‌లో పలువురు వ్యాఖ్యలు పెట్టారు. ఇదంతా ఇలా ఉంటే భారత్‌ బ్యాటింగ్‌తో చెలరేగిపోతుంటే ఫీల్డింగ్‌ చేస్తున్న పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ ఆవలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అసలే ఆవలిస్తే పేగులు లెక్కపెడుతున్న సోషల్‌ మీడియా ఈ వ్యవహారంపై దుమ్మెత్తిపోసింది.

ఏమైనా మాంచెస్టర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన భారత్ పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ వికెట్ల వెనుక ఫీల్డ్ సెట్ చేస్తున్న క్రమంలో దీర్ఘంగా ఆవులింత తీయడం సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతోంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్ కు నిద్ర ఎలా ముంచుకొస్తోంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇదే మ్యాచ్‌లో సర్ఫరాజ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించడం అంటే ఆత్మహత్యా సదృశ్యమే అని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వరల్డ్ కప్ టోర్నీలోనే ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా టెయిలెండర్‌ బ్యాట్స్‌మెన్ కు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వడంతో మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది. ఇలా వరుసగా తన వివాదాస్పద చర్యలతో అపఖ్యాతి మూటగట్టుకున్న సర్ఫారాజ్ భారత్ పాక్ మ్యాచ్ లోనూ ఆవులిస్తూ దొరికిపోవడంతో అతడిని నెటిజన్లు ఒక ఆటఆడుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories