వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమిండియాకు శుభ పరిణామం

వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమిండియాకు శుభ పరిణామం
x
Highlights

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. దీంతో మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే...

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. దీంతో మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ ను గెలుచుకుంది టీమిండియా. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్‌(13), కొలిన్‌ మన్రో(7) తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. ఆ తరువాత కేన్ విలియంసన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా(28) పరుగులతో అతను కూడా వెనుతిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్(93), టామ్ లాథమ్‌ (51) కివీస్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 119 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే అనూహ్యంగా వీరిద్దరూ అవుట్ అయ్యాక కివీస్ ఆటగాళ్లు ఒకరి తరువాత మరొకరు అవుట్ అయ్యారు.

మొత్తంగా కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగుకు దిగిన భారత జట్టు 43 ఓవర్లలో 245 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ రోహిత్(62), కోహ్లీ(60), పరుగులు చేశారు. వీరిద్దరూ అవుట్ అయ్యాక అంబటి రాయుడు(40), దినేష్ కార్తీక్(38) కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను విజయవంతంగా ముగించేశారు. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ ను చేజిక్కించుకుంది. ఇదిలావుంటే ఇటీవలే ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ కు ముందు ఇలా వరుస సిరీస్ లు గెలుపొందడం టీమిండియాకు శుభ పరిణామంగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories