ఇర్ఫాన్ పఠాన్ 15 ఏళ్ల రికార్డును అధిగమించిన షమీ

ఇర్ఫాన్ పఠాన్ 15 ఏళ్ల రికార్డును అధిగమించిన షమీ
x
Highlights

న్యూజిలాండ్ తో నేపియర్ వేదికగా ముగిసిన తొలివన్డేలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఓ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత తొలిబౌలర్ గా నిలిచాడు.

న్యూజిలాండ్ తో నేపియర్ వేదికగా ముగిసిన తొలివన్డేలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఓ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత తొలిబౌలర్ గా నిలిచాడు. 15 ఏళ్ల క్రితం ఇర్ఫాన్ పఠాన్ నెలకొల్పిన రికార్డును షమీ అధిగమించాడు. ఇర్ఫాన్ పఠాన్ 59 వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని చేరితే షమీ మాత్రం కేవలం 56 వన్డేల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, మున్రోలను షమీ క్లీన్ బౌల్డ్ గా పడగొట్టాడు. వన్డే ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన టీమిండియా ఇతర బౌలర్లలో జహీర్ ఖాన్, అజిత్ అగర్కార్, జవగళ్ శ్రీనాథ్ ఉన్నారు. జహీర్ ఖాన్ 65 వన్డేల్లో, అగార్కర్ 67 వన్డేల్లో, శ్రీనాథ్ 68 వన్డేల్లో వికెట్ల శతకాలు పూర్తి చేయటం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories