India vs Bangladesh 2nd Test match : 68 పరుగుల లీడ్ లో భారత్

India vs Bangladesh match updates
x
India vs Bangladesh match updates
Highlights

51 పరుగులకి రెండు వికెట్లు కోల్పోయిన భారత ఇన్నింగ్స్ ని కెప్టెన్ కోహ్లి , పుజారా కలిసి చక్కదిద్దే పని పెట్టుకున్నారు.

కొలకత్తా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటిరోజు మ్యాచ్ లో బంగ్లాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది భారత్ . మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ జట్టు భారత బౌలర్ల దాటికి కుప్పకూలిపోయింది. కేవలం 106 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇందులో ఆ జట్టు ఓపెనర్ షద్మాన్ ఇస్లాం ఒక్కడే 29 పరుగులు చేసి టాప్ లో నిలిచాడు.

ఇక ఆ తర్వాత ఇన్నింగ్స్ ని ప్రారంభించిన భారత్ కి ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్ లో డబల్ సెంచరీ చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన మయంక్ అగర్వాల్14(21) ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పుజారాతో ఇన్నింగ్స్ ని కొనసాగించిన రోహిత్ శర్మ 21(35) కాసేపటికే వెనుదిరిగాడు.

51 పరుగులకి రెండు వికెట్లు కోల్పోయిన భారత ఇన్నింగ్స్ ని కెప్టెన్ కోహ్లి , పుజారా కలిసి చక్కదిద్దే పని పెట్టుకున్నారు. మరో వికెట్ పడుకుంటా జాగ్రత్తపడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రహనే క్రీజ్ లోకి వచ్చాడు. మరో వికెట్ పడకుండా చూసుకుంటూ ఆడుతూ తొలిరోజు ఆటను ముగించారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్లను కోల్పోయి 174 పరుగులని సాధించింది. ఇందులో 68 పరుగుల ముందంజలో ఉంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories