Top
logo

నువ్వా నేనా ? : నేడే భారత్ -బంగ్లా ఫైనల్ మ్యాచ్

Ind vs BanInd vs Ban
Highlights

ఈరోజు నాగపూర్ లో నువ్వా నేను అన్నట్టుగా బరిలోకి దిగాబోతున్నాయి ఇండియా- బంగ్లాదేశ్ జట్లు... ఇరు జట్ల మధ్య ఈ...

ఈరోజు నాగపూర్ లో నువ్వా నేను అన్నట్టుగా బరిలోకి దిగాబోతున్నాయి ఇండియా- బంగ్లాదేశ్ జట్లు... ఇరు జట్ల మధ్య ఈ రోజు మూడవ టీ20 మ్యాచ్ రాత్రి ఏడూ గంటలకు జరగనుంది.. ఇప్పటికే జరిగిన రెండు టీ20 మ్యాచ్ లలో చేరోకటి గెలిచి సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి సిరీస్ ని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నాయి.

ప్రస్తుతం పసికూన బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేయలేము. ఇలాగే అనుకుంటే మొదటి మ్యాచ్ లో పెద్ద షాకునే ఇచ్చింది ఆ జట్టు... ఇప్పుడు ఈ సిరీస్ ని గెలవడం భారత జట్టుకు తప్పనిసరి.. ఎందుకంటే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. దీనిలో టీం ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో గెలిచి ఆటగాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపాలని జట్టు చూస్తుంది.

ఇక భారత్ ను ఓడించేందుకు బంగ్లా కూడా చాలానే కసరత్తులు చేస్తుంది. ముఖ్యంగా భారత ఓపెనర్స్ అయిన రోహిత్ శర్మ,శిఖర్ ధావన్ లను తొందరగా అవుట్ చేస్తే మ్యాచ్ పై పట్టు సాధించవచ్చునని భావిస్తుంది. మొత్తానికి ఇరు జట్ల మధ్య ఈ రోజు జరగబోయే మ్యాచ్ చాలా ఉత్కంటగా మారింది..

Next Story