logo

గెలుపుదిశగా భారత్.. వరుణుడు అడ్డంకి..

గెలుపుదిశగా భారత్.. వరుణుడు అడ్డంకి..

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. 236/6 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ ఆదిలోనే మరో వికెట్ వికెట్‌ కోల్పోయింది. అంతకు ముందు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా చిరుజల్లులు కురువడం, వెలుతురులేమి కారణంగా దాదాపు గంటన్నర ముందుగానే ఆటను నిలిపివేశారు. ఇక ఏడవ వికెట్ గా మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ప్యాట్‌ కమిన్స్‌ (25) ‍క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తరువాత క్రీజులో నిలదొక్కుకున్న హ్యాండ్స్‌కోంబ్‌(37) కూడా అవుట్ అయ్యాడు. ఆ వెంటనే లీయోన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు. స్టార్క్ (8), హాజిలీవూడ్(0) క్రీజులో ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను 622/7 స్కోర్‌ వద్ద డిక్లెర్డ్‌ చేసిన భారత్‌.. గెలుపు దిశగా ప్రయాణిస్తుండగా.. వరుణుడు అందుకు అడ్డంకిగా మారాడు.

Raj

Raj

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top