India vs Australia, 3rd ODI : ఉత్కంఠ భరితంగా సాగనున్న తుదిపోరు..

India vs Australia, 3rd ODI : ఉత్కంఠ భరితంగా సాగనున్న తుదిపోరు..
x
Highlights

భారత్ -ఆస్ర్టేలియా జట్ల మధ్య జరగనున్న చివరి మ్యాచ్ కి రంగం సిద్దం అయింది. బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరిగా గా సాగనుంది.

భారత్ -ఆస్ర్టేలియా జట్ల మధ్య జరగనున్న చివరి మ్యాచ్ కి రంగం సిద్దం అయింది. బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరిగా గా సాగనుంది. ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకొని భారత్ ని మరోసారి దెబ్బ కొట్టాలని ఆసీస్ ఎదురు చూస్తుంటే, గత ఏడాది ఎదురైనా పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఆశిస్తోంది.

భారత జట్టుకి ఓపెనర్స్ ప్రధాన బలంగా చెప్పుకోవాలి. ఇందులో ధావన్ ఆకట్టుకుంటూ ఉండగా, రోహిత్ ఇంకా రాణించాల్సి ఉంది. ఇక కోహ్లి మేరపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, రాహుల్ , మనిష్ పాండేతో బలంగానే కనిపిస్తుంది. కానీ శ్రేయస్ అయ్యర్ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. రాహుల్ మొదటి మ్యాచ్ లో పర్వాలేదు అనిపించినా, రెండో మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక మనిష్ పాండే కూడా ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక ఆల్‌రౌండర్ కోటాలో స్థానం పొందిన రవీంద్ర జడేజా ఫర్వాలేదనిపిస్తున్నాడు.

మొదటి వన్డేలో ఘోరంగా విఫలమైన భారత బౌలర్లు రెండో వన్డేలో పుంజుకున్నారు. మొదటి మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయని భారత్ బౌలర్లు రెండో వన్డేలో ఆ జట్టును ఆలౌట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మహ్మద్ షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ సత్తాచాటడంతో బౌలింగ్ విభాగంలో కూడా భారత్ పటిష్టంగా కనిపిస్తుంది.

ఇక ఆసీస్ విషయానికి వచ్చేసరికి మొదటి వన్డేలో ఒంటిచేతుతో మ్యాచ్ ని గెలిపించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్.. రాజ్‌కోట్ వన్డేలో మాత్రం తేలిపోయారు. ఇక స్టీవ్ స్మిత్ కూడా ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్ నుంచి ఆ జట్టు ఇంకా సత్తాచాటాలి. బౌలింగ్ విభాగంలో కూడా పూర్తిగా ఫెయిల్ అవుతూ వస్తుంది ఆసీస్ జట్టు..మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.

జట్ల అంచనా ఇలా ఉంది

భారత్:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ షైనీ, జస్‌ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ షమీ.

ఆసీస్:

అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), అస్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కబ్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ లబుషేన్, కేన్ రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, అస్టన్ టర్నర్, ఆడమ్ జంపా, డీఆర్క్‌ షాట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories