భారత బౌలర్ల దెబ్బకి కివీస్ విలవిల.. భారత్ టార్గెట్ 133

భారత బౌలర్ల దెబ్బకి కివీస్ విలవిల.. భారత్ టార్గెట్ 133
x
Highlights

ఆక్లాండ్ వేదికగా భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో భారత బౌలర్లు సక్సెస్ అయ్యారు. కివీస్ ని ఏ దశలో కూడా కోలుకోనివ్వకుడా...

ఆక్లాండ్ వేదికగా భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో భారత బౌలర్లు సక్సెస్ అయ్యారు. కివీస్ ని ఏ దశలో కూడా కోలుకోనివ్వకుడా కట్టుదిట్టం చేశారు. దీనితో కివీస్ నిర్ణిత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు ఆరంభం పర్వాలేదు అనిపించింది. పవర్ ప్లే ఆఖరి ఓవర్లో శార్దూల్ బౌలింగ్‌లో భారీ షాటే ఆడేందుకు గప్టిల్ ప్రయత్నించి కోహ్లికి చిక్కాడు. దీనితో 48 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత దూబే బౌలింగ్‌లో మున్రో కూడా కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 68 పరుగులకే కివీస్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత వచ్చిన గ్రాండ్ హోమ్ (3), విలియమ్సన్ 14 (20) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగారు. దీనితో కివీస్ 12 ఓవర్లకే 81 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో సిఫెర్ట్ 33(26), రాస్ టైలర్ 18(24) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనితో న్యూజిలాండ్ 132 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అయిన చేయగలిగింది. దీనితో భారత లక్ష్యం 133 గా ఉంది. ఇక ఈ ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నెగ్గిన భారత్.. 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories