రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
x
Highlights

వెస్టిండీస్ బౌలర్ హోల్డర్ బంతితో భారత్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, అతని బౌలింగ్ లో ఆచి, తూచి ఆడుతున్న కోహ్లీ, రాహుల్...

వెస్టిండీస్ బౌలర్ హోల్డర్ బంతితో భారత్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, అతని బౌలింగ్ లో ఆచి, తూచి ఆడుతున్న కోహ్లీ, రాహుల్ రెండో వైపు బౌలింగ్ చేస్తున్న అలెన్ ను లక్ష్యంగా చేసుకుని పరుగులు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో వరల్డ్ కప్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ మధ్య జరుతుతున్న మ్యాచ్ లో చక్కని క్రికెట్ వినోదం అభిమానులకు దొరుకుతోంది. 18వ ఓవర్లో వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ఎట్టకేలకు హోల్డర్ ప్రయత్నాలు ఫలించాయి. ఇన్నింగ్స్ 21 వ ఓవర్ నాలుగో బంతికి చక్కగా ఆడుతున్న భారత్ ఓపెనర్ రాహుల్ హోల్డర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియ స్కోరు 21 ఓవర్లకు రెండు వికెట్లకు 98 పరుగులు. కోహ్లీ 30 పరుగులతోనూ, విజయ్ శంకర్ పరుగులు లేకుండా క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories